‘రాహుల్ అనే నేను’.. స్టైల్ మార్చేశాను..!
Send us your feedback to audioarticles@vaarta.com
ఎప్పుడూ సింపుల్‌గా.. వైట్ కలర్ పైజామా దుస్తుల్లో కనిపించే కాంగ్రెస్ యువ నేత రాహుల్ గాంధీ ఒక్కసారిగా స్టైల్ మార్చేశారు. సొంత పార్టీ నేతలే గుర్తు పట్టలేనంతగా తన మేకోవర్‌ను చేంజ్ చేసుకున్నారు. ఒక్కసారిగా రాహుల్‌ను చూసిన వారికి ‘భరత్ అనే నేను’ సినిమా గుర్తు రాక మానదు. హెయిర్ స్టైల్ నుంచి ఆయన కంప్లీట్‌గా తన స్టైల్‌ను మార్చేశారు. చేతిలో ట్యాబ్.. ఫార్మల్ డ్రెస్.. టక్ చేసుకుని అలా నడిచి వస్తుంటే.. బ్యాక్ గ్రౌండ్‌లో ‘రాహుల్ అనే నేను’ అంటూ ఆర్ఆర్ వినిపించింది చూస్తున్న వారికి.
సొంత పార్టీ నేతలే రాహుల్‌ని చూసి షాక్ అయ్యారు. ఇక రాహుల్‌ని చూసిన దేశ ప్రజానీకం.. ఆయన పిక్స్‌ను సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తోంది. రాహుల్ గాంధీ సింప్లిసిటీకి బ్రాండ్ అంబాసిడర్‌లా కనిపిస్తారు. సామాన్యులతో బాగా కలిసిపోతుంటారు. లేనిపోని ఆర్భాటాలకు వెళ్లరు. పలు సందర్భాల్లో ఈ విషయం రుజువైంది కూడా. ఇక రాహుల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కావాలని ఆ పార్టీ నేతలు కోరుతున్నారు. త్వరలో యువరాజు పట్టాభిషేకం ఉంటుందనే వార్తలు కూడా బాగా వినిపిస్తున్నాయి. కానీ ఆయన అధ్యక్ష పదవిని స్వీకరిస్తారా? లేదా? అనే విషయంలో సస్పెన్స్ కొనసాగుతోంది.
ఇటీవలి కాలంలో రాహుల్ సామాన్య ప్రజానీకానికి మరింత దగ్గరగా ఉంటూ వస్తున్నారు. ఇటీవల తమిళనాడు వెళ్లిన రాహుల్ గాంధీ.. అక్కడి సామాన్యులతో బాగా కలిసిపోయారు. అక్కడి స్థానిక ఓ వంటల యూట్యూబ్ చానెల్ కోసం పుట్టగొడుల బిర్యానీ తయారీలో రాహుల్ పాల్గొన్నారు. అనంతరం వారితో కలిసి కూర్చొని భోజనం చేసి అందరనీ ఆశ్చర్యపరిచారు. మొత్తానికి రాహుల్ ప్రస్తుతం ఆయన స్టైల్‌తో యువతను బాగా ఆకట్టుకున్నారనడంలో సందేహం లేదు. రాహుల్ గాంధీలో ఈ మార్పు కాంగ్రెస్ పార్టీకి ఎంతో కొంత సహకరిస్తుందనడంలో సందేహం లేదు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments