Rahul Gandhi: జగిత్యాలలో దోసెలు వేసిన రాహుల్ గాంధీ.. వీడియోలు వైరల్..
Send us your feedback to audioarticles@vaarta.com
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నారు. రెండు రోజులుగా బస్సు యాత్ర చేపట్టిన రాహుల్.. ప్రజలతో మమేకమవుతూ ముందుకు సాగుతున్నారు. ప్రస్తుతం జగిత్యాల జిల్లాలో పర్యటిస్తున్న రాహుల్.. నూకపల్లిలో స్కూటీపై వెళ్తున్న ప్రయాణికులతో ముచ్చటించి చిన్నారులకు చాక్లెట్స్ అందించారు. అనంతరం అక్కడే ఉన్న ఓ టిఫిన్ బండి వద్దకు వెళ్లి కాసేపు సరదాగా దోసెలు వేశారు. పక్కనే ఉన్న భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి దోసె ఎలా వేయాలో రాహుల్‌కు కొన్ని టిప్స్ చెప్పారు. దోసె తినాలంటే ఎంత డబ్బు చెల్లింటాలంటూ రాహుల్.. టిఫిన్ సెంటర్ యజమానిని అడిగారు. దోసెలు వేసిన రాహుల్.. బండి ఓనర్‌కు వాటిని తినిపించి ఎలా ఉందంటూ అడిగారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
మనలో ఒక్కడు.. మనందరి కోసం ఒక్కడు..
రాహుల్‌తో పాటు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క్, మధుయాష్కీ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ ఉన్నారు. ఈ ఫోటోలను తెలంగాణ కాంగ్రెస్ ట్విట్టర్లో పోస్ట్ చేస్తూ మనలో ఒక్కడు.. మనందరి కోసం ఒక్కడు.. అతడే మన రాహుల్ గాంధీ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. మరోవైపు రాహుల్ గాంధీ అత్యవసరంగా ఢిల్లీ వెళ్లాల్సి ఉండటంతో ఆయన షెడ్యూల్లో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. రాహుల్ కొండగట్టు సందర్శన వాయిదా పడింది.
పార్టీకి నష్టమని తెలిసినా సోనియా తెలంగాణ ఇచ్చారు..
గత రెండు రోజుల్లో జరిగిన విజయభేరి సభల్లో రాహుల్ మాట్లాడుతూ ఈ ఎన్నికలు దొరల తెలంగాణ, ప్రజల తెలంగాణ మధ్య జరగబోతున్నాయని తెలిపారు. రాజకీయంగా పార్టీకి నష్టమని తెలిసినా సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారన్నారు. కానీ రాష్ట్రం వచ్చి పదేళ్లు గడిచినా ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదని రాహుల్ పేర్కొన్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రిలా కాకుండా రాజులా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో ముఖ్య శాఖలన్నీ తన ఆధీనంలోనే ఉంచుకున్నారని విమర్శించారు. ఈ పదేళ్లలో కేసీఆర్ ఏ ఒక్క హామీనైనా నెరవేర్చారా అని ప్రశ్నించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout