సుప్రీంకోర్టుకు క్షమాపణ చెప్పిన రాహుల్ 

  • IndiaGlitz, [Wednesday,May 08 2019]

కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు రాహుల్ గాంధీ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టుకు క్షమాపణలు చెప్పారు. ‘చౌకీదార్‌ చోర్‌’ అంటూ ప్రధానమంత్రిని ఉద్దేశించి రాహుల్ చేసిన వ్యాఖ్యలను సుప్రీంకోర్టుకు తప్పుగా ఆపాదించినందుకు గానూ ఆయన సుప్రీంకోర్టుకు బేషరతుగా క్షమాపణలు చెప్పారు.

అయితే ఈ వ్యాఖ్యలను తాను ఉద్దేశపూర్వకంగా చేయలేదని పేర్కొంటూ బుధవారం నాడు మూడు పేజీల అఫిడవిట్‌‌ను రాహుల్ దాఖలు చేశారు. సుప్రీంకోర్టు అత్యున్నత సంస్థ అని, దాని మీద తనకు అపార గౌరవం ఉందని అఫిడవిట్‌లో రాహుల్ పేర్కొన్నారు. రఫెల్ వ్యవహారంలో మోదీ చోర్ అని సుప్రీంకోర్టే స్పష్టం చేసిందని రాహుల్ వ్యాఖ్యానించారు.

న్యాయవ్యవస్థ విధానాల్లో ప్రత్యక్షంగా, పరోక్షంగా గానీ జోక్యం చేసుకునే ఉద్దేశం తనకు లేదని ఆయన చెప్పుకొచ్చారు. కాగా.. ఈ వ్యవహారంలో తనపై నమోదైన నేరపూరిత కోర్టు ధిక్కార కేసు విచారణను మూసేయాలని రాహుల్‌ ఈ సందర్భంగా కోర్టును అభ్యర్థించారు. చౌకీదార్‌ చోర్‌ వ్యాఖ్యలను సుప్రీంకోర్టు తీర్పునకు ఆపాదించినందుకు గానూ రాహుల్‌ గతంలో విచారం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.

More News

ఫలితాలకు ముందే ఏపీ యంగ్ మంత్రి రాజీనామా!

ఆంధ్రప్రదేశ్‌ వైద్య ఆరోగ్య, గిరిజన సంక్షేమ శాఖమంత్రి మంత్రి కిడారి శ్రావణ్‌ కుమార్ రాజీనామా చేయనున్నారు. కాగా..

5 కోట్ల మంది చెవుల్లో కాలీఫ్లవర్లు పెట్టారుగా చంద్రబాబూ!?

ఆంధ్రప్రదేశ్ విభజనాంతరం నవ్యాంధ్ర రాజధాని అమరావతిని మరో సింగపూర్‌గా, అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మిస్తానని.. రాజధాని అంటే ఇలా ఉండాలని అందరూ అనుకోవాలని..

అపోలో ఫ్యామిలీతో దుబాయ్ వెళ్లిన ఉపాస‌న‌

ఉపాస‌న కామినేని కొణిదెల‌కు ప్లానింగ్ అంటే ఇష్టం. అటు కుటుంబానికి, ఇటు వృత్తికీ, అటు వ్యాపకానికీ అన్నిటికీ స‌మంగా స‌మ‌యాన్ని పంచ‌గ‌ల దిట్ట ఆమె.

‘మహర్షి’ రిలీజ్‌కు ముందు దిల్‌రాజుకు ‘ఐటీ’ షాక్

టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజుకు ఐటీ (ఇన్‌కం ట్యాక్స్ డిపార్ట్‌మెంట్) అధికారులు షాకిచ్చారు.

థియేటర్ల యాజమాన్యాలకు ఊహించని షాకిచ్చిన తలసాని

కొత్త సినిమాలు విడుదలైనప్పుడు టికెట్ రేట్లు పెంచుకోవచ్చన్న హైకోర్టు ఆదేశాల మేరకు థియేటర్ల యాజమాన్యాలు అనుకున్నట్లుగానే టికెట్లు పెంచేశాయి.