Modi:తెలంగాణలో రాహుల్, రేవంత్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారు: మోదీ

  • IndiaGlitz, [Tuesday,April 30 2024]

తెలంగాణలో డబుల్ ఆర్ ట్యాక్ వసూలు చేస్తున్నారని ప్రధాని మోదీ ఆరోపించారు. జహీరాబాద్‌లో జరిగిన బీజేపీ బహిరంగ సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ రాష్ట్రంలో డబుల్ ఆర్(రేవంత్, రాహుల్) ట్యాక్ వసూలు చేసి ఢిల్లీలో కప్పం కడుతున్నారని.. వెంటనే ఆర్‌ ట్యాక్స్ అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ఎక్కడ అధికారంలో ఉన్నా పంచసూత్రాలతో పాలన చేస్తుందని విమర్శించారు. పంచసూత్రాలు అంటే అవినీతి, అబద్ధాలు, ఓటు బ్యాంకు రాజకీయాలు, మాఫియా, కుటుంబ రాజకీయాలు అని తెలిపారు.

పొరపాటున కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రజలపై సంపద పన్ను కూడా వేస్తారని.. అలా మన సంపదలో 55 శాతాన్ని కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని పేర్కొన్నారు. ఇక మొన్నటి వరకూ తెలంగాణను బీఆర్ఎస్ పార్టీ దోచుకుంటే.. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ దోచుకుంటుందని మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఒక అవినీతి కుంభకోణం అని.. కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు దానిపై విచారణ చేయడం లేదని ప్రశ్నించారు. అలాగే బీఆర్ఎస్ పాలనలో ఓటుకు నోటు కేసును తొక్కి పెట్టారని.. రెండు పార్టీలు ఒకటే అని మోదీ విమర్శించారు.

అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో రుణమాఫీ చేస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మోసం చేసిందన్నారు. ఈ పదేళ్లలో దేశం ఎంత ముందుకు వెళ్లిందో దేశ ప్రజలు అంతా చూశారని.. అలాగే అంతకుముందు కాంగ్రెస్ పాలనలో ఎంత అవినీతి ఉందో కూడా అందరూ చూశారని చెప్పుకొచ్చారు. దేశాన్ని కాంగ్రెస్ పార్టీ అవినీతి ఊబిలోకి నెట్టేసిందని అన్నారు. 500 ఏళ్లుగా భారతీయుల కలగా ఉన్న అయోధ్యలో రామ మందిర నిర్మాణం చేపట్టామని వివరించారు. ఇక్కడ హైదరాబాద్‌లో పండుగలు జరుపుకోవాలంటే ఎన్నో ఆంక్షలు ఉన్నాయని.. ఓ వర్గం ఓట్ల కోసమే పండుగలపై ఆంక్షలు విధిస్తున్నారని మోదీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

More News

T20 World Cup: టీ20 ప్రపంచకప్‌కు భారత జట్టు ఇదే.. పంత్ ఇన్.. రాహుల్ ఔట్..

అమెరికా, వెస్టిండీస్‌ వేదికల్లో జరిగే టీ20 ప్రపంచకప్‌(T20 World Cup 2024) కోసం భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. రోహిత్ శర్మ సారథ్యంలో 15 మంది సభ్యులతో కూడిన జట్టును బీసీసీఐ ప్రకటించింది.

Revanth vs KCR: తెలంగాణ సీఎం రేవంత్, మాజీ సీఎం కేసీఆర్ మధ్య ట్విట్టర్ వార్..

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్‌ మధ్య మాటల తూటాలు పేలుతున్నారు. ఇరువురు నేతలు ట్విట్టర్ వేదికగా తీవ్రస్థాయిలో ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు.

TDP Alliance Manifesto:టీడీపీ కూటమి మేనిఫెస్టో విడుదల.. పింఛన్ రూ.4వేలు

టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి మేనిఫెస్టోను విడుదల చేసింది. ఉండవల్లిలో టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో

Mehreen :పెళ్లి కాకుండానే పిల్లలను కనేందుకు.. హీరోయిన్ మెహ్రీన్ షాకింగ్ నిర్ణయం..

టాలీవుడ్ హీరోయిన్ మెహ్రీన్ పిర్జాదా కొన్ని రోజులుగా సినిమాలకు దూరంగా ఉంటుంది. నేచురల్ స్టార్ నాని నటించిన 'కృష్ణ గాడి వీర ప్రేమగాథ'

Devi Prasad :తోటపల్లి మధు వ్యాఖ్యలపై దేవీప్రసాద్ కౌంటర్.. ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌.

ఎవరైనా ప్రముఖుల గురించి మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడాలి. అదే సినీ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖుల గురించి అయితే