రెహమాన్ ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారా?
Send us your feedback to audioarticles@vaarta.com
ఆస్కార్ విన్నర్ ..ఎక్కడకు వెళ్లినా గౌరవం ఉన్న మ్యూజిక్ డైరెక్టర్ ఎ.ఆర్.రెహమాన్ ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారా? చేసుకోవాలనుకున్నారట. ఈ విషయాన్ని ఆయనే తన బయోగ్రఫీ `నోట్స్ ఆఫ్ ఎ డ్రీమ్`లో వెల్లడించారు. ``నా పాత పేరు దిలీప్‌కుమార్. ఆ పేరంటే ఎందుకో నాకు నచ్చేదే కాదు. నా వ్యక్తిత్వానికి సూట్ అయ్యే పేరు కాదనిపించేది. అందరూ చేసే పని చేయకూడదనే సంగీతం వైపు వచ్చాను. నాన్న చనిపోయిన తర్వాత ఒక్కసారిగా జీవితం శూన్యంగా మారింది.
మరోవైపు భయాన్ని పోగొట్టింది. 23 ఏళ్లకు చదువు పూర్తయింది. ఎవరికి వారు మనం ఎందుకు పనికిరాం అని అనుకునే ఆలోచనల వల్ల పాతికేళ్లకు ఆత్మహత్య కూడా చేసుకోవాలనే ఆలోచనలు వేంటాడేవి. రోజాతో సంగీత దర్శకుడిగా మారే క్రమంలో మా కుటుంబం ఇస్లాంలోకి మారింది. మతం మారాక పాత జ్ఞాపకాలన్నీ వదిలేశా. 35 సినిమాలకు సంగీతం చేసే అవకాశం వస్తే రెండే సినిమాలకు సంగీతం అందించాను. అవకాశాలను సద్వినియోగ పరుచుకోవాలని చాలా మంది చెప్పినా జీవితానికి సరిపడా తిండిని ఒకేసారి కాకుండా కొంచెం కొంచెం తింటూ ముందుకెళ్లాలని అనుకున్నాను. మనసు చెప్పినట్లే వినాలని నమ్మే నేను సంగీత రంగంలో ఎదిగాను. సంగీతం కారణంగానే మార్పు సంభవించింది`` అన్నారు రెహమాన్.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout