'16 -ఎవ్వెరీ డీటెయిల్ కౌంట్స్' నా కెరీర్ లో బెస్ట్ మూవీ : రహమాన్
Send us your feedback to audioarticles@vaarta.com
బిచ్చగాడు వంటి సెన్సేషనల్ మూవీని తెలుగు ప్రేక్షకులకు అందించిన నిర్మాణ సంస్థ శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలింస్ బ్యానర్‌పై చదలవాడ బ్రదర్స్ సమర్పణలో రెహమాన్, ప్రకాష్ విజయ్ రాఘవన్, అశ్విన్ కుమార్ తదితరులు తారాగణంగా కార్తీక్ నరేన్ దర్శకత్వంలో చదలవాడ పద్మావతి నిర్మాతగా రూపొందుతోన్న చిత్రం `16 -ఎవ్వెరీ డీటెయిల్ కౌంట్స్` . ఈ సినిమా మార్చి 10న విడుదలవుతుంది. ఈ సందర్భంగా...
రహమాన్ మాట్లాడుతూ - ``తమిళంలో గతేడాది డిసెంబర్లో విడుదలైన ధృవంగల్ 16 సినిమాను తెలుగులో `16 -ఎవ్వెరీ డీటెయిల్ కౌంట్స్` పేరుతో విడుదల చేస్తున్నారు. కర్ణాటకలో కూడా సినిమా పెద్ద సక్సెస్ అయ్యింది. మార్చి 10న ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో లక్ష్మణ్‌గారు సినిమాను తెలుగులో విడుదల చేస్తున్నారు. మంచి నావెల్టీతో పాటు కంటెంట్ ఉన్న సినిమా ఇది. కార్తీక్ నరేన్ సినిమాను అద్భుతంగా తెరకెక్కించారు. ముందు కార్తీక్ నా వద్దకు కథ నెరేట్ చేయడానికి రాగానే, ఇందులో నాది పోలీస్ క్యారెక్టర్ అని తెలుసుకుని ముందు చేయకూడదని నిర్ణయించుకున్నాను. కానీ కార్తీక్ ఎలాగో నన్ను ఒప్పించి కథను నెరేట్ చేశాడు. నాకు ప్రతి సీన్ ఎంతో థ్రిల్లింగ్‌గా అనిపించింది. స్క్రీన్‌ప్లే బేస్డ్ మూవీ. రెండు సినిమాల్లో నటించిన నాకు, నా కెరీర్లో బెస్ట్ మూవీ ఇది`` అన్నారు.చిత్ర దర్శకుడు కార్తీక్ నరేన్ మాట్లాడుతూ - ``రెహమాన్‌గారు ఒప్పుకోకుంటే, ఈ సినిమాను నేను చేసుండేవాడిని కాను. కమర్షియల్ ఎలిమెంట్స్ ఏమీ సినిమాలో ఉండవు. కానీ డిఫరెంట్ ఫీల్‌ను ఇస్తుంది. మార్చి 10న విడుదలవుతున్న ఈ సినిమాను అందరూ పెద్ద సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను`` అన్నారు.
లక్ష్మణ్ మాట్లాడుతూ - ``సాధారణంగా నాకు థ్రిల్లర్ సినిమాలు పెద్దగా నచ్చవు కానీ ఈ సినిమాను చూడగానే చాలా టెన్షన్‌గా చూస్తుండిపోయాను. రెహమాన్‌గారు తప్ప ఈ సినిమాలో పోలీస్ క్యారెక్టర్‌ను మరెవరూ చేయలేరనేలా నటించారు. ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేయాలనుకుంటే కార్తీక్ నరేన్గారు అందుకు ఒప్పుకోలేదు. గతేడాది మే నెలలో బిచ్చగాడు సినిమా తెలుగులో విడుదలై సెన్సేషనల్ హిట్ సాధించింది. అలాగే ఈ 16 సినిమా తమిళంలో చిన్న సినిమాగా విడుదలై, తెలుగులో పెద్ద సక్సెస్ అవుతుంది. ఈ సినిమాలో క్లైమాక్స్ వరకు అసలేం జరిగిందని ఎవరూ ఉహించలేరు. యూనివర్సల్ పాయింట్‌తో రూపొందిన చిత్రం. హిందీలో నేను ఈ సినిమాను రీమేక్ చేయాలనుకుంటున్నాను. చర్చలు జరుగుతున్నాయి. తెలుగులో సినిమాను మార్చి 10న విడుదల చేస్తున్నాం. బిచ్చగాడు సినిమా తెలుగులో ఎంత రెవల్యూషన్ క్రియేట్ అయ్యిందో, 16 సినిమా కూడా అంతే పెద్ద సక్సెస్ సాధిస్తుంది`` అన్నారు.
టి.ప్రసన్నకుమార్ మాట్లాడుతూ - ``బిచ్చగాడు సినిమాను తెలుగులో విడుదల చేసిన నిర్మాతలు చేస్తున్న మరో గొప్ప సినిమా 16. తమిళంలో సెన్సేషనల్ హిట్ అయ్యింది. తెలుగులో కూడా మార్చి 10న విడుదలవుతుంది. తెలుగులో కూడా తిరుగులేని సక్సెస్‌ను సాధిస్తుంది`` అన్నారు.
చదలవాడ శ్రీనివాసరావు మాట్లాడుతూ - ``రెహమాన్‌గారి నటన, కార్తీక్ నరేన్ టేకింగ్ సినిమాకు హైలైట్ అంశాలు. క్లైమాక్స్ ఎవరూ ఉహించని విధంగా ఉంటుంది. ఈ సినిమా గ్యారంటీ హిట్ అవుతుంది`` అన్నారు.
ఈ చిత్రానికి సంగీతంః బిజోయ్, సినిమాటోగ్రఫీః సుజిత్ సరాంగ్, ఎడిటర్ః శ్రీజిత్ సరాంగ్, మాటలుః శివరామ ప్రసాద్ గోగినేని, నిర్మాతః చదలవాడ పద్మావతి, రచన, దర్శకత్వంః కార్తీక్ నరేన్.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments