నాగ్ ఒకటి.. చైతు రెండు..

  • IndiaGlitz, [Wednesday,November 18 2015]

నాగార్జున న‌ట వార‌సుడిగా తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లోకి అడుగుపెట్టాడు నాగ‌చైత‌న్య‌. తండ్రిలా త‌ను కూడా రొమాంటిక్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు. మాస్ హీరోగా మాత్రం నాన్న అడుగుజాడ‌ల్లోనే వెళ్లాల‌ని ప్ర‌య‌త్నం చేసినా ఫ‌లితం ద‌క్క‌లేదు. ఇదిలా ఉంటే.. ఓ విష‌యంలో మాత్రం నాగ్ కంటే చైతు ఓ అడుగు ముందున్నాడు.

అదేమిటంటే.. డ‌బుల్ ఆస్కార్ అవార్డుల‌ను సొంతం చేసుకున్న ఎ.ఆర్‌.రెహ‌మ‌న్‌తో ప‌నిచేయ‌డం. నాగ్ ఇప్ప‌టివ‌ర‌కు ఒక్క 'ర‌క్ష‌కుడు' సినిమా కోసం మాత్రమే రెహ‌మ‌న్‌తో ప‌నిచేస్తే.. చైత‌న్య 'ఏమాయ చేసావె' వంటి హిట్ చిత్రంతో పాటు ప్ర‌స్తుతం 'సాహ‌సం శ్వాస‌గా సాగిపో' చేస్తున్నాడు. మొత్త‌మ్మీద‌.. ఎ.ఆర్‌.రెహ‌మ‌న్ కాంబినేష‌న్‌లో నాగ్ ఒక సినిమాతో స‌రిపెడితే.. చైతు అంత‌కుమించి చేస్తూ 'సాగిపో'తున్నాడన్న‌మాట‌.

More News

కమల్ నెక్ట్స్ మూవీకి పక్కా ప్లాన్...

కమల్ హాసన్ నటించిన తాజా చిత్రం చీకటి రాజ్యం.తమిళ్ లో ఇప్పటికే రిలీజైన చీకటి రాజ్యం సినిమాకి మంచి స్పందన లభిస్తోంది.

క్రిష్ణాష్టమి రిలీజ్ డేట్ మారింది..

కమెడియన్ టర్నడ్ హీరో సునీల్ నటిస్తున్నతాజా చిత్రం క్రిష్ణాష్టమి. ఈ చిత్రాన్ని జోష్ ఫేం వాసు వర్మ తెరకెక్కిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఈ మూవీని నిర్మిస్తున్నారు.

'లోఫర్ ' కు భారీ పోటీ...

వరుణ్ తేజ్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తల్లీకొడుకుల సెంటిమెంట్ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం 'లోఫర్'.ఇందులో వరుణ్ కి తల్లిగా రేవతిగా నటించింది.

నవంబర్ 27న విడుదలవుతున్న 'నేను..నా ప్రేమ కథ'

కె.ఎన్.రావ్ సమర్పణలో శాస్టా మీడియాస్, దత్తాత్రేయ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్స్ పై శేఖర్, సుష్మ, డయానా హీరో హీరోయిన్లుగా రూపొందిన చిత్రం నేను..నా ప్రేమ కథ.

'శ్రీమంతుడు' సైకిల్ ను విజేతకు అందించిన సూపర్ స్టార్ మహేష్

సూపర్ స్టార్ మహేష్ హీరోగా మైత్రి మూవీ మేకర్స్,ఎం.బి.ఎంటర్ టైన్ మెంట్ ప్రై.లి.పతాకాలపై కొరటాల శివ దర్శకత్వంలో నవీన్ ఎర్నేని,యలమంచిలి రవిశంకర్,సి.వి.మోహన్(సివిఎం)సూపర్ డూపర్ హిట్ మూవీ 'శ్రీమంతుడు'.