రెహ్మాన్ కోసం గెస్ట్ గా మహేష్..

  • IndiaGlitz, [Thursday,March 31 2016]

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు...జ‌న‌ర‌ల్ గా మాట్లాడ‌డం త‌క్కువ‌..మీడియాతో మాట్లాడ‌డం ఇంకా త‌క్కువ‌. అలాగే ఫంక్ష‌న్స్ కి వెళ్ల‌డం కూడా త‌క్కువే అని చెప్పాలి. కాక‌పోతే ఈమ‌ధ్య మ‌హేష్ లో కాస్త మార్పు వ‌చ్చింది. ఆగ‌డు సినిమా ప్లాప్ త‌ర్వాత సినిమా స‌క్సెస్ కి ప్ర‌మోష‌న్ ఎంత అవ‌స‌ర‌మో తెలుసుకున్నాడు. అందుక‌నే శ్రీమంతుడు సినిమాని బాగా ప్ర‌మోట్ చేసాడు. సూప‌ర్ స‌క్సెస్ సాధించాడు. ప్ర‌మోష‌న్ ప్రాముఖ్య‌త తెలుసుకున్నాడు క‌నుక‌నే మ‌హేష్ సుధీర్ బాబు సినిమా ఆడియో ఫంక్ష‌న్స్ కి గెస్ట్ గా వెళుతున్నాడు.అలాగే... నాని కృష్ణ‌గాడి వీర ప్రేమ గాథ, అఖిల్ ఆడియో ఫంక్ష‌న్ కి కూడా మ‌హేష్ గెస్ట్ గా వెళ్ళిన విష‌యం తెలిసిందే.
ఇక అస‌లు విష‌యానికి వ‌స్తే...రెహ్మాన్ కోసం గెస్ట్ గా వ‌చ్చేందుకు మ‌హేష్ అంగీక‌రించాడ‌ట‌. ఇంత‌కీ ఏ కార్య‌క్రమానికి అంటారా..? రెహ్మాన్ మేన‌ల్లుడు జి.వి.ప్ర‌కాష్ న‌టించిన చిత్రం పెన్సిల్. ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేయ‌నున్నారు. తెలుగులో హీరోగా త‌న అదృష్టాన్ని ప‌రీక్షించుకుంటున్న జి.వి.ప్ర‌కాష్ పెన్సిల్ ఆడియో ఫంక్ష‌న్ కి మ‌హేష్ గెస్ట్ గా వ‌స్తే బాగుంటుంద‌నుకున్నాడ‌ట‌. జి.వి.ప్ర‌కాష్ మేన‌మామ రెహ్మాన్ మ‌హేష్ ని సంప్ర‌దిస్తే మ‌హేష్ ఓకే అన్నాడ‌ని స‌మాచారం. ఇదే క‌నుక జ‌రిగితే...జి.వి.ప్రకాష్ పెన్సిల్ సినిమాకి మ‌హేష్ వ‌ల్ల క్రేజ్ రావ‌డం ఖాయం.

More News

బాలయ్య వందో సినిమాకి క్రేజీ మ్యూజిక్ డైరెక్టర్..

నందమూరి నటసింహం బాలకృష్ణ వందో సినిమా గురించి రోజుకో ఇంట్రస్టింగ్ న్యూస్ బయటకు వస్తుంది.

ఎన‌భై శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న చుట్టాల‌బ్బాయి

ఆది, న‌మిత‌, యామిని హీరో, హీరోయిన్లుగా వీర‌భ‌ద్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న చిత్రం చుట్టాల‌బ్బాయి. ఈ చిత్రాన్నిశ్రీ ఐశ్వ‌ర్య ల‌క్ష్మీ మూవీస్ బ్యాన‌ర్ పై వెంక‌ట్ త‌లారి నిర్మిస్తున్నారు.

స‌ర్ధార్ సెన్సార్ పూర్తి..

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ - కాజ‌ల్ జంట‌గా న‌టించిన చిత్రం స‌ర్ధార్ గబ్బ‌ర్ సింగ్. ఈ చిత్రాన్ని బాబీ తెర‌కెక్కించారు. ఈ సెన్సేష‌న‌ల్ మూవీ సెన్సార్ కార్య‌క్ర‌మాల‌ను ఈరోజు పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డ్ స‌ర్ధార్ గ‌బ్బ‌ర్ సింగ్ సినిమాకి యు/ఎ స‌ర్టిఫికెట్ ఇచ్చింది.

గ్లామ‌ర‌స్ అంటే స్కిన్ షో చేయ‌డం కాదు...అదే. - హీరోయిన్ హ‌ర్షిక

సూర్యతేజ, హర్షిక‌ పూనాచా హీరో హీరోయిన్లుగా రూపొందిన‌ చిత్రం అప్పుడలా ఇప్పుడిలా. కె.ఆర్.విష్ణు ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు. జంపా క్రియేషన్స్ బ్యానర్ పై  ప్రదీప్ కుమార్ జంపా ఈ చిత్రాన్ని నిర్మించారు.

బాలీవుడ్ లో సూర్య 24..

సూర్య హీరోగా మనం ఫేం విక్రమ్ కుమార్ తెరకెక్కిస్తున్న క్రేజీ మూవీ 24.