రెహమాన్.. 25 ఏళ్ల తరువాత
- IndiaGlitz, [Wednesday,November 29 2017]
రోజా' (1992).. భారతీయ చిత్ర పరిశ్రమకి సంబంధించినంతవరకు ఈ సినిమా ఓ సంచలనం. కమర్షియల్ గా మంచి విజయం సాధించడమే కాకుండా.. ఓ సంచలన సంగీత దర్శకుడిని ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి పరిచయం చేసిందీ మణిరత్నం చిత్రం. ఆ సంగీత దర్శకుడే డబుల్ ఆస్కార్ అవార్డ్స్ విన్నర్ ఎ.ఆర్.రెహమాన్.
ఆ సినిమా విడుదలైన నెలలోపే మరో చిత్రంతో పలకరించారు రెహమాన్. అయితే అది ఓ మలయాళ సినిమా కావడం విశేషం. మోహన్ లాల్, మధుబాల జంటగా నటించిన ఆ చిత్రమే యోధ'. కమర్షియల్‌గా మంచి విజయం సాధించడమే కాకుండా.. పాటల పరంగానూ ఈ సినిమా ఓ సెన్సేషనే.
ఆ తరువాత మళ్లీ మలయాళ చిత్రానికి సంగీతమందించని ఎ.ఆర్.రెహమాన్.. సరిగ్గా 25 సంవత్సరాల తర్వాత ఓ మలయాళ చిత్రం చేయబోతున్నారు. పృథ్విరాజ్ కథానాయకుడిగా ఆడుజీవితం' అనే పేరుతో తెరకెక్కనున్న 3డి సినిమాకి రెహమాన్ స్వరాలు అందించనున్నారని తాజాగా వార్తలు వినిపిస్తున్నాయి.
ప్రఖ్యాత మలయాళ రచయిత బెన్యమిన్ రాసిన నవల ఆధారంగా రూపొందనున్న ఈ సినిమాకి బ్లెస్సి డైరెక్టర్. 2019లో ఈ 3డి మూవీ విడుదల కానుంది.