జాతీయ క్రీడ‌కు రెహ్మాన్‌, గుల్జార్ ...

  • IndiaGlitz, [Monday,September 24 2018]

ఇండియా జాతీయ క్రీడ హాకీ.. ఈ ఏడాది న‌వంబ‌ర్‌లో ఒరిస్సా రాజ‌ధాని భువ‌నేశ్వ‌ర్‌లో హాకీ వ‌రల్డ్ క‌ప్ జ‌ర‌గ‌నుంది. ఇందుకోసం ఒరిస్సా రాష్ట్ర ప్ర‌భుత్వం ఓ ప్ర‌త్యేక గీతాన్ని త‌యారు చేయిస్తుంది. ప్ర‌ముఖ ర‌చ‌యిత గుల్జార్ ఈ పాట‌ను రాస్తుండ‌గా.. ఆస్కార్ విన్న‌ర్ ఎ.ఆర్‌.రెహ‌మాన్ పాట‌కు సంగీతాన్ని అందించ‌నున్నారు.

జై హింద్ హింద్‌.. జై ఇండియా ఇండియా అనే సాహిత్యంతో పాట సాహిత్యం ఉండ‌బోతుంది. కేవ‌లం సినిమాల‌కు సంగీతం అందించ‌డ‌మే కాదు.. పలు ప్రైవేట్ సాంగ్స్‌ ద్వారా రెహమాన్ ప్ర‌త్యేక‌మైన గుర్తింపును సంపాదించుకున్నారు. ఇప్పుడు ఆయ‌న కంపోజ్ చేయ‌బోయే హాకీ సాంగ్ ఎలా ఉండ‌బోతుంద‌న‌నే ఆస‌క్తి అంద‌రిలో నెల‌కొంది.