ఈనెల 27న విడుదలౌతున్న యాక్షన్ థ్రిల్లర్ ఎంటర్ టైనర్ 'రహదారి'
Send us your feedback to audioarticles@vaarta.com
సేతు, అభిషేక్, రాజ్, పూజ, ఉమాశంకర్, శ్వేత, విజయ్ ముఖ్య పాత్రలు పోషిస్తున్న చిత్రం రహదారి. యాక్షన్ థ్రిల్లర్ ఎంటర్ టైన్ మెంట్ గా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సెలెబ్స్ అండ్ రెడ్ కార్పెట్ బ్యానర్ పై రాజ్ జకారిస్ ఈ చిత్రాన్ని గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. సురేష్ కుమార్ మరియు రాజ్ డైరెక్టర్స్. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఈనెల 27న ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు. రాహుల్ రాజ్ అద్భుతమైన సంగీతమందించారు. యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ చిత్రాల్లో గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేగా ఈ చిత్రాన్ని మలిచారు. అనిల్ అరసు యాక్షన్ ఎపిసోడ్స్ అబ్బుర పరుస్తాయని దర్శకనిర్మాతలు చెబుతున్నారు. కిషోర్ మణి అద్భుతమైన విజువల్స్ తో కథకు రిచ్ నెస్ తీసుకొచ్చారు.
ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ.... యాక్షన్ థ్రిల్లర్ తరహా కథలకు మన దగ్గర డిమాండ్ ఎక్కువ. అన్ని వర్గాల ప్రేక్షకులు ఈ చిత్రాల్ని ఆదరిస్తున్నారు. తెలుగు ప్రేక్షకుల టేస్ట్ కు తగ్గట్టుగా రహదారి పేరుతో మేం రూపొందించిన యాక్షన్ థ్రిల్లర్ చిత్రాన్ని ఈనెలమెదటి వారంలో విడుదల చేద్దామనుకున్నాం కాని మహెష్బాబు నటించిన బ్రహ్మోత్సవం చిత్రం విడుదలవుతున్న సంధర్బంలో ధియోటర్స్ ప్రాబ్లం వలన విడుదల చేయలేకపోయాం. ఇప్పడు మాకు ధియటర్స్ నుండి పర్మిషన్స్ రావటంతో 27న గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నాం. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి. రాహుల్ రాజ్ అద్భుతమైన పాటలందించారు. ప్రతీ పాటకు చిత్రంలో ఇంపార్టెన్స్ ఉంటుంది. డైరెక్టర్ స్క్రీన్ ప్లేను అద్భుతంగా మలిచారు. అనిల్ యాక్షన్ ఎపిసోడ్స్ చిత్రానికి హైలైట్ గా నిలుస్తాయి. అని అన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com