పీసీసీ చీఫ్‌గా రఘువీరా ఔట్.. ‘పళ్లం’కు పగ్గాలు!

  • IndiaGlitz, [Sunday,August 04 2019]

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజనాంతరం తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్‌కు కష్టాలు మొదలైన సంగతి తెలిసిందే. తెలంగాణ సంగతి అటుంచితే.. ఏపీలో ఎమ్మెల్యే, ఎంపీ సీటు కాదు కదా.. సర్పంచ్‌గా కూడా కాంగ్రెస్ అభ్యర్థి గెలవలేని పరిస్థితి. పేరుకే కేడర్, నేతలున్నారో తప్ప పట్టుమని పది ఓట్లు పుట్టించుకోలేకపోతున్నారు. అయితే ఈ పరిస్థితులు మారాలి..? ఒకప్పుడు కాంగ్రెస్ కేరాఫ్‌ అడ్రస్‌గా ఉన్న ఏపీని మళ్లీ తమ ఖాతాలో వేసుకోవాలని హస్తం ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ అవి సక్సెస్ కాలేదు.. మున్ముంథు కూడా సక్సెస్ అయ్యే అవకాశాలు అస్సలే లేవని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

అయితే 2019 ఎన్నికల అనంతరం టీడీపీ సైకిల్ తునాతునకలవ్వడంతో.. బీజేపీ జోరు పెంచి కమలాన్ని వికసింపచేస్తోంది. అయితే కాషాయాన్ని తొక్కేయాలని.. హస్తం విశ్వప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో ఏపీ కాంగ్రెస్‌లో పలు మార్పులు చేర్పులు చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటోంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీకి కొత్త బాస్ కోసం వేట
మొదలుపెట్టింది. ఇప్పటి వరకూ పీసీపీ చీప్‌గా ఉన్న రఘువీరారెడ్డిని పక్కనెట్టి.. ఆయన స్థానంలో కేంద్ర మాజీ మంత్రి ఎం.పళ్లంరాజును నియమించనున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.

కాగా.. రాహుల్ గాంధీ జాతీయాధ్యక్షుడిగా కొనసాగలేనని.. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో ఘోర పరాజయానికి తానే కారణమని భావిస్తూ రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించేశారు. అయితే ఈ క్రమంలో దేశంలో పలు రాష్ట్రాలు కాంగ్రెస్ పెద్దలు.. పీసీపీ చీఫ్‌లు రాజీనామాలు చేసేశారు. వారిలో రఘువీరారెడ్డి కూడా ఒకరు. అంతేకాదు ఆయన నేతృత్వంలో పార్టీ ఏ మాత్రం ముందుకు పోలేదని భావించిన కాంగ్రెస్ ఆయన్ను పూర్తిగా పక్కనెట్టి పళ్లంకు పగ్గాలు ఇవ్వాలని ఢిల్లీ అధిష్టానం భావిస్తోంది. అయితే ఈ పీసీసీ చీఫ్ రేసులో పళ్లం రాజుతో పాటు మాజీ కేంద్రమంత్రి చింతా మోహన్, మాజీ మంత్రి శైలజానాథ్, ఏపీ కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలిగా పనిచేసిన సుంకర పద్మ కూడా ఉన్నారు. అయితే వీరిలో పళ్లంకు పెద్దలంతా ఓటేశారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే త్వరలోనే అధికారిక ప్రకటన ఉంటుందని తెలుస్తోంది. అంతేకాదు పళ్లంకు సుధీర్ఘ రాజకీయ అనుభవం ఉండటం.. కేంద్ర మంత్రిగా పనిచేయడం ఇవన్నీ కలిసొచ్చాయని చెప్పుకోవచ్చు. మరీ ముఖ్యంగా కాంగ్రెస్‌కు టాటా చెప్పేసి పలువురు రాజకీయ ఉద్ధండులు అటు టీడీపీలోకి.. ఇటు వైసీపీలోకి చేరినప్పటికీ పళ్లం మాత్రం పార్టీలోనే ఉంటూ వస్తున్నారు. ఇది కూడా పళ్లం పెద్ద అడ్వాంటేజే.

ఇదిలా ఉంటే.. బీజేపీ పుంజుకుంటున్న టైమ్‌లో ‘హస్తం’ సత్తా ఏంటో చూపించాలని ఢిల్లీ పెద్దలు పక్కాప్లాన్‌తో ముందుకెళ్తున్నారు. అయితే ప్రస్తుతం ఏపీలో అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీని పక్కనెడితే.. బీజేపీ వర్సెస్ కాంగ్రెస్‌గా పరిస్థితులున్నాయి. ఈ రెండు పార్టీల్లో ఎవరు ఏ మాత్రం కార్యకర్తలను కాపాడుకొని ముందుకెళ్తారో వేచి చూడాల్సిందే మరి.

More News

రియల్ హీరో అనిపించుకున్న ‘రేసుగుర్రం’ విలన్!

ఇండియాలో చాలా చిత్రవిచిత్రమైన రాజకీయ నేతలను మనం చూసే ఉంటాం.. కనీసం వార్తల్లో అయినా ఫలానా నేత ఇలా చేశారు..

పునర్నవీని డేట్‌కు పిలిచిన రాహుల్.. రియాక్షన్ ఇదీ..!

తెలుగు రియాల్టీ షో బిగ్‌బాస్-03 ఇప్పటి వరకూ గొడవలతో అరుపులతో ఎపిసోడ్ ముగిసిపోయేది. అయితే శుక్రవారం మాత్రం ఈ షో చూసిన వాళ్లంతా కంటతడిపెట్టుకున్నారు.

తీన్మార్ సావిత్రి ప్రేమ కథ.. కన్నీటి ప్రవాహమే!

తెలుగు రియాల్టీ షో బిగ్‌బాస్-03 ఇప్పటి వరకూ గొడవలతో అరుపులతో ఎపిసోడ్ ముగిసిపోయేది. అయితే శుక్రవారం మాత్రం ఈ షో చూసిన వాళ్లంతా కంటతడిపెట్టుకున్నారు.

టీడీపీకి దేవినేని రాజీనామా.. జగన్ సమక్షంలో వైసీపీలోకి!

తెలుగు యువత అధ్యక్షుడు, మంత్రిగా కొడాలి నానినే ఢీ కొన్న నేత దేవినేని అవినాష్ ఆ పార్టీకి గుడ్ బై చెప్పేశారు.!

రాజకీయాలకు ‘ఇక సెలవు’ అంటున్న కుమారన్న!

అవును మీరు వింటున్నది నిజమే.. కర్నాటక మాజీ సీఎం హెచ్‌ డీ కుమారస్వామి కీలక నిర్ణయం తీసుకున్నారు.