లోక్‌సభ స్పీకర్, హోంశాఖ సెక్రటరీని కలవనున్న రఘురామ కృష్ణంరాజు

ఏపీలో గత కొద్ది రోజులుగా అనూహ్య పరిస్థితులు చోటు చేసుకున్నాయి. వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు తమ పార్టీ నేతలపైనే కయ్యానికి కాలు దువ్వారు. నువ్వెంత అంటే నువ్వెంత అనే స్థాయికి వ్యవహారం వెళ్లడంతో పార్టీ ఆయనకు షోకాజ్ నోటీస్ జారీ చేసింది. తనకు జారీ అయిన షోకాజ్ నోటీసుపై కూడా రఘురామ కృష్ణంరాజు తీవ్ర స్థాయిలో సమాధానమిచ్చారు. రఘురామ కృష్ణంరాజు ప్రశ్నలనే సమాధానంగా సంధించడం విశేషం. దీంతో ఏపీలో రాజకీయం రసవత్తరంగా మారింది.

ఈ నేపథ్యంలో ఆయన నేడు ఢిల్లీలో లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాతో పాటు హోంశాఖ సెక్రటరీ అజయ్‌భల్లాను కలవనున్నట్టు తెలుస్తోంది. తనకు ప్రాణ హాని ఉందని.. కాబట్టి కేంద్ర బలగాలతో రక్షణ కల్పించాలని కోరనున్నట్టు తెలుస్తోంది. అలాగే వైసీపీలో క్రమశిక్షణాసంఘం వ్యవహారంపై కూడా రఘురామ కృష్ణంరాజు ఈసీని కలవనున్నట్టు సమాచారం.

More News

తెలంగాణలో 11 వేలు దాటిన కరోనా కేసులు

తెలంగాణ రాష్ట్రంలో విపరీతంగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో కరోనా కేసులు 11 వేలు దాటాయి.

అందుకే కరోనా పరీక్షలు నిలిపివేశాం: ఆరోగ్యశాఖ డైరెక్టర్

సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు జీహెచ్ఎంసీ పరిధిలో 50 వేల కరోనా పరీక్షలు నిర్వహించాలని భావించామని..

అజిత్ భారీ కరోనా సాయం..

కరోనా విపత్తును ఎదుర్కొంటున్న ఏ ఒక్కరినీ కూడా వదలకుండా హీరో అజిత్ కుమార్ సాయమందించడంపై సోషల్ మీడియా వేదికగా హర్షం వ్యక్తమవుతోంది.

హైదరాబాద్‌లో కరోనా టెస్టుల నిలిపివేత.. కారణం ఏంటంటే..

తెలంగాణలో కేసులు ఎంత దారుణంగా పెరుగుతున్నాయో.. టెస్టులు అంత తక్కువ స్థాయిలో జరుగుతున్నాయనే విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి.

ఫేమస్ థియేటర్ దగ్గర.. లైంగిక వేధింపులు ఎదుర్కొన్నా: రెజీనా

సౌత్ ఇండియన్ సినిమాల ద్వారా మంచి క్రేజ్‌ను సంపాదించుకున్న రెజీనా.. మళ్లీ చాలా గ్యాప్ తర్వాత మెగాస్టార్ చిరంజీవి సరసన కొరటాల దర్శకత్వంలో నటిస్తోంది.