మరో మార్గం లేకే మీడియా ముందుకు వెళ్లా: జగన్‌కు రఘురామ లేఖ
Send us your feedback to audioarticles@vaarta.com
వైసీపీలో ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలు.. తనకు షోకాజ్ నోటీసు ఇవ్వడం.. పలు సందర్భాల్లో తాను పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడేందుకు దారి తీసిన పరిస్థితులను వివరిస్తూ ఎంపీ రఘురామ కృష్ణరాజు సీఎం జగన్‌కు లేఖ రాశారు. ఎంపీ విజయసాయిరెడ్డి షోకాజ్ నోటీసుకు తాను సమాధానమిచ్చానన్నారు. రిజిస్టర్ అయిన పార్టీ కాకుండా మరో పేరుతో ఉన్న లెటర్‌హెడ్‌తో తనకు నోటీసు వచ్చిందన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పేరును వాడుకోవద్దని పలు సందర్భాల్లో ఈసీ చెప్పిన విషయాన్ని రఘురామ కృష్ణరాజు గుర్తు చేశారు. తాను వెంకటేశ్వర స్వామికి అపర భక్తుడినని.. కాబట్టే స్వామివారి ఆస్తుల అమ్మకం విషయంలో భక్తుల మనోభావాలను చెప్పానన్నారు. తానెప్పుడూ పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరించలేదని స్పష్టం చేశారు.
మిమ్మల్ని కలిసే అవకాశమివ్వండంటూ రఘురామకృష్ణరాజు జగన్‌ను కోరారు. తనకు వ్యక్తిగత భద్రత అంశంపై మాత్రమే స్పీకర్, హోంమంత్రిని కలిశానని.. అలాగే జిల్లా వంటకాలు ఎంపీలకు రుచి చూపించేందుకే డిన్నర్ మీటింగ్ ఏర్పాటు చేశానన్నారు. తను యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడూ బద్దుడినేనన్నారు. ఇసుక విషయాన్ని జగన్ దృష్టికి తీసుకెళ్లేందుకు యత్నించానని.. మరో మార్గం లేకే మీడియా ముందుకు వెళ్లానన్నారు. జగన్ చుట్టూ ఉన్న కొందరు వ్యక్తులు తనను క్రైస్తవునిగా చిత్రీకరించారని ఆవేదన వ్యక్తం చేశారు. రాజ్యాంగంపై ప్రమాణం చేసి బాధ్యతలు చేపట్టానని.. ఆ రాజ్యాంగం కల్పించిన భాష, హక్కుల మేరకే లోక్‌సభలో స్పందించానన్నారు. దీనిలో తప్పుబట్టాల్సిన అంశమేమీ లేదని.. కానీ షోకాజ్ నోటీసులో ఆ విషయాన్ని కూడా ప్రస్తావించారని రఘురామకృష్ణరాజు తెలిపారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout