ఢిల్లీకి వైసీపీ ఎంపీలు.. షాకిచ్చిన రఘురామ కృష్ణరాజు
Send us your feedback to audioarticles@vaarta.com
ఎత్తులకు పై ఎత్తులతో ఏపీలో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు.. ఆ పార్టీకి మధ్య నెలకొన్న విభేదాలు చిలికి చిలికి గాలివానగా మారుతున్నాయి. నేడు వైసీపీ ఎంపీలు.. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను కలిసి రఘురామపై అనర్హత వేటు వేయాలని కోరేందుకు సిద్ధమవుతుండగా ఆయన ఆ పార్టీకి షాకిచ్చేలా అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు రఘురామ కృష్ణరాజు హైకోర్టులో పిటిషన్ వేశారు.
తనపై అనర్హత, సస్పెన్షన్ చర్యలను అడ్డుకోవాలని రఘురామ కృష్ణరాజు హైకోర్టును ఆశ్రయించారు. తనకు వేరే పార్టీ లెటర్ హెడ్‌పై షోకాజ్ నోటీసులు ఇచ్చారని పిటిషన్‌లో పేర్కొన్నారు. తాను యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ తరుఫున ఎంపీగా ఎన్నికయ్యానని.. కానీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లెటర్ హెడ్‌పై షోకాజ్ నోటీసు ఇచ్చారని పిటిషన్‌లో పేర్కొన్నారు. తానెక్కడా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడలేదని.. కానీ తాను పాల్పడ్డానని చెప్పి అనర్హత పిటిషన్ ఇచ్చేందుకు వైసీపీ ఎంపీలు ఢిల్లీ వెళుతున్నారని రఘురామ కృష్ణరాజు పేర్కొన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout