షోకాజ్‌కి సమాధానంగా.. మరోసారి విరుచుకుపడ్డ రఘురామ కృష్ణంరాజు
Send us your feedback to audioarticles@vaarta.com
బుధవారం పార్టీ జారీ చేసిన షోకాజ్ నోటీసుపై వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు సమాధానమిచ్చారు. వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాలో ఎంపీ విజయసాయిరెడ్డి షోకాజ్ నోటీసు పంపించడంపై ఆయన విమర్శలు గుప్పించారు. రాష్ట్ర స్థాయి గుర్తింపు పొందిన పార్టీకి జాతీయ ప్రధాన కార్యదర్శి ఎలా ఉంటారని ప్రశ్నించారు. అసలు వైసీపీలో క్రమశిక్షణ సంఘం అనేది ఒకటుందా? అని ఆయన ప్రశ్నించారు. సమాధానం పేరుతో రఘురామ కృష్ణంరాజు వైసీపీపై మరోసారి విరుచుకుపడ్డారు.
‘‘వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ పేరు ఎలా ఉంటుంది?యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీకి బదులుగా..
మరో పార్టీ పేరుతో షోకాజ్ నోటీసు ఎలా ఇస్తారు? రాష్ట్ర స్థాయి గుర్తింపు పొందిన పార్టీకి ..జాతీయ ప్రధాన కార్యదర్శి ఎలా ఉంటారు? వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌లో క్రమశిక్షణ సంఘం ఉందా? క్రమశిక్షణ సంఘానికి ఎన్నికల గుర్తింపు ఉందా? క్రమశిక్షణ సంఘానికి చైర్మన్, సభ్యులు ఎవరు..?
విజయసాయిరెడ్డి సమాధానం చెప్పాలి’’ అని రఘురామ కృష్ణంరాజు ప్రశ్నించారు.
కాగా.. ఎమ్మెల్యేలను కించపరుస్తూ వ్యాఖ్యలు చేస్తున్నారంటూ ఎంపీ రఘురామ కృష్ణంరాజుకు బుధవారం వైసీపీ షోకాజ్ నోటీసు జారీ చేసింది. వైసీపీ తరుఫున పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి ఈ నోటీసును జారీ చేశారు. పార్టీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా మాట్లాడటంతో పాటు.. అధినాయకత్వానికి వ్యతిరేకంగా చేస్తున్న వ్యాఖ్యలను షోకాజ్ నోటీసులో పేర్కొన్నారు. పార్టీ నేతలపై చేసిన వ్యాఖ్యలకు వారం లోగా సమాధానం ఇవ్వకుంటే క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments