న్యాయదేవతకు వస్త్రాపహరణం జరుగుతోంది: రఘురామ ఆవేదన

ద్రౌపది వస్త్రాపహరణంతో ఏపీ రాజకీయాలను పోల్చి వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. మంగళవారం ఆయన ఢిల్లీలోని తన నివాసంలో రచ్చబండ కార్యక్రమంలో మాట్లాడారు. అలనాడు కౌరవసభలో ద్రౌపది వస్త్రాపహరణం జరిగిందని.. నేడు అదే మాదిరిగా ఏపీలో న్యాయదేవతకు వస్త్రాపహరణం జరుగుతోందంటూ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. నేటి అభినవ కౌరవసభలో తాను భాగస్వామినయినందుకు సిగ్గు పడుతున్నానని రఘురామ కృష్ణరాజు పేర్కొన్నారు. నాడు ద్రౌపదిని గోవిందుడు కాపాడితే.. నేడు న్యాయ వ్యవస్థను రాష్ట్రపతి కోవింద్ కాపాడుతారని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఆంధ్రప్రదేశ్‌లో న్యాయవ్యవస్థను నిర్వీర్యం చేసేందుకు యత్నం జరుగుతోందని.. దానిని ‘ధరిత్రి ఎరుగని చరిత్ర’గా రఘురామ కృష్ణరాజు అభివర్ణించారు. రాజ్యాంగం న్యాయమూర్తులకు ఉద్దేశాలను ఆపాదించవద్దని స్పష్టం చేసినప్పటికీ దాడులు మాత్రం ఆగడం లేదన్నారు. పరిమితులనేవి పార్లమెంటుకు సైతం ఉన్నాయన్నారు. కోర్టులను దూషించిన వారిలో ఆమంచి కృష్ణమోహన్, నందిగం సురేశ్‌తో పాటు మరికొందరు రెడ్లు ఉన్నారని రఘురామ కృష్ణరాజు పేర్కనొ్నారు.

మరోవైపు సోషల్ మీడియాలో దూషణల పర్వం కొనసాగుతోందంటూ ఆరు నెలలుగా ఫిర్యాదులు చేస్తున్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోవడం లేదన్నారు. వైసీపీ నేతలపై ఆరోపణలకు మాత్రమే ప్రాధాన్యమిస్తూ కేసులు నమోదు చేసి అరెస్టులు చేస్తున్నారని రఘురామ కృష్ణరాజు ఆరోపించారు. అంతేకాకుండా సీబీసీఐడీపై కూడా ఆయన విరుచుకుపడ్డారు. ఇంతవరకు ఒక్కరిని కూడా అరెస్టు చేయలేని, చేతకాని, నిస్సహాయ, నిస్సిగ్గు సీబీసీఐడీ రాష్ట్రంలో ఉందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మాతృభాషలోనే హత్య చేసే ప్రయత్నం జరుగుతోందని రఘురామ కృష్ణరాజు ఆవేదన వ్యక్తం చేశారు.

More News

హైకోర్టుకు బాలీవుడ్... వ‌ర్మ ఎద్దేవా!!

బాలీవుడ్ చిత్ర ప‌రిశ్ర‌మ కొన్ని మీడియా సంస్థ‌ల‌పై హైకోర్టును ఆశ్ర‌యించింది.

అన్న‌పై కౌంట‌ర్... త‌మ్ముడు రీకౌంట‌ర్‌

క్రేజీ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ రీసెంట్‌గా రాజ‌కీయాలు, ఓటర్లు గురించి మాట్లాడుతూ సెన్సేష‌న‌ల్ కామెంట్స్ చేసిన సంగ‌తి తెలిసిందే.

నిలిచిపోయిన మరో వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్..

కరోనా మహమ్మారిని అరికట్టేందుకు అభివృద్ధి చేస్తున్న మరో వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ తాత్కాలికంగా నిలిచిపోయాయి.

ప్రేరణను పరిచయం చేసిన ప్రభాస్..

యంగ్ రెబల్‌ స్టార్ ప్రభాస్‌, రాధాకృష్ణకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం ‘రాధేశ్యామ్’‌. పీరియాడిక్ లవ్‌ ఎంటర్‌టైనర్‌గా

మనం మాట్లాడుకోపోతేనే బెటర్ : మోనాల్‌కు తెగేసి చెప్పిన అభి

ఇవాళ నామినేషన్స్.. గత వారం స్థాయిలో రచ్చ అయితే జరగలేదు. గత వారంతో పోలిస్తే ఈవారం ప్రశాంతంగానే జరిగినట్టు అనిపించింది.