ఈ సమయంలో కూడా ఇలానా..? రివ్యూవర్స్‌పై రఘు కుంచె ఫైర్
Send us your feedback to audioarticles@vaarta.com
కరోనా కారణంగా ఒకరకంగా ప్రపంచమే స్తంభించిపోయింది. దీనిలో భాగంగానే సినీ పరిశ్రమ కూడా మొత్తంగా స్తంభించిపోయింది. సినిమా షూటింగ్‌లతో పాటు.. రిలీజ్లు కూడా ఆగిపోయాయి. దీంతో రివ్యూలు రాసే వారికి పని లేకుండా పోయింది. పరిస్థితులు ఎప్పుడు సర్దుకుంటాయో.. సినిమాలు ఎప్పుడు రిలీజ్ అవుతాయో తెలియని పరిస్థితి. దీంతో సినీ పరిశ్రమ్ డిజిటల్ వైపు అడుగులు వేస్తోంది. దీనిలో భాగంగానే తమ సినిమాలను ఓటీటీ ద్వారా విడుదల చేస్తున్నారు. దీంతో మళ్లీ రివ్యూలు రాసేవారికి చేతినిండా పని దొరికింది. తాజాగా వీరిపై ప్రముఖ సంగీత దర్శకుడు రఘు కుంచె తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు.
రఘు కుంచె మరో ముగ్గురు మిత్రులతో కలిసి నిర్మాతగా వ్యవహరించిన 47డేస్ సినిమా జీ5 ఓటీటీ ద్వారా విడుదలైంది. ఈ సినిమాపై కొందరు రివ్యూవర్స్ నెగిటివ్ కామెంట్స్ గుప్పించారు. ఈ సినిమా వెండితెరపై విడుదలైతే భారీ నష్టాన్ని చవిచూడాల్సి వచ్చేదంటూ ప్రేక్షకుల తరుఫున కూడా తీర్పిచ్చేశారు. దీనిపై స్పందించిన రఘు కుంచె.. తాము కష్టపడి సినిమాలు తీస్తామని.. కొందరు బాల మేధావులు సినిమా బాగోలేదని రాస్తున్నారన్నారు. సినిమాపై సాధారణ ప్రేక్షకులు చాలా పాజిటివ్‌గా ఉన్నారని.. సినిమా గురించి కూడా మంచి అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నారని పేర్కొన్నారు. సినిమా పరిశ్రమ తీవ్ర సంక్షోభములో ఉన్న ఈ సమయంలో తమను ఇబ్బంది పెట్టకుంటే బాగుంటుందన్నారు. సినిమా గురించి ఏం రాసినా తాము చూస్తూ ఉండాలా? అని ప్రశ్నించారు. మనసు పెట్టి ఆలోచించాలని రఘు కుంచె సూచించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments