ఆ అందమైన ప్రేమకథకు హీరోగా రఘు కుంచె...
Send us your feedback to audioarticles@vaarta.com
‘పలాస 1978’ చిత్రంలో నటించి ఉత్తమ నటనను కనబరిచిన ప్రముఖ సంగీత దర్శకుడు రఘు కుంచెకు మరో అద్భుతమైన ఆఫర్ వరించింది. 29 ఏళ్లుగా జైలు జీవితాన్ని అనుభవిస్తున్న మహిళ బయోపిక్‌గా రూపొందతున్న ఓ సినిమాలో ఆయన హీరోగా నటించనున్నారు. గోగో మూవీస్ పతాకంపై పీరియాడిక్ మూవీగా ‘కథానళిని’ అనే టైటిల్‌తో ఈ చిత్రం రూపుదిద్దుకోనుంది. ద్విభాషా చిత్రంగా(తెలుగు-తమిళ్) నిర్మితమవుతున్న ఈ చిత్రంలో స్టార్ హీరోయిన్ టైటిల్ పాత్ర పోషిస్తుండగా, ఆమె భర్త మురుగన్‌గా రఘు కుంచె నటించనున్నారు.
ఈ చిత్రానికి మహేంద్ర కొక్కిరిగడ్డ రచన, దర్శకత్వం వహిస్తున్నారు. ఒక మహా విస్ఫోటనం వెనుక ఉన్న అందమైన ప్రేమకథే ఈ ‘కథానళిని’ చిత్రం అని దర్శకుడు మహేంద్ర తెలిపారు. అయితే 1991కు పూర్వం.. ఎవరికీ తెలియని నిజ జీవిత కథ కావడం విశేషం. కాగా.. ఇప్పటికే సంగీత దర్శకుడిగా ఆపై సింగర్‌గా కూడా రఘు కుంచె మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తాజాగా ‘47 డేస్’ చిత్రాన్ని మరో ముగ్గురితో కలిసి నిర్మించి నిర్మాతగా కూడా మంచి సక్సెస్‌ను అందుకున్న విషయం తెలిసిందే. ‘కథానళిని’ చిత్రం తన నట జీవితానికి మంచి టర్నింగ్ పాయింట్ అవుతుందని రఘు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout