ఆ హీరోయిన్ తో వర్క్ చేయాలనుకుంటున్న దర్శకేంద్రుడు..
Send us your feedback to audioarticles@vaarta.com
ఏ హీరోయిన్ అయినా దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు సినిమాలో నటించాలి అనుకుంటుంది. అయితే...దీనికి భిన్నంగా రాఘవేంద్రరావే ఓ హీరోయిన్ తో వర్క్ చేయాలనుకుంటున్నారట. వినడానికి...చదవడానికి..కాస్త కొత్తగా ఉన్నా...ఇది నిజం. ఈ విషయాన్ని స్వయంగా రాఘవేంద్రరావే ట్విట్టర్ ద్వారా తెలియచేసారు.
ఇంతకీ ట్విట్టర్ లో దర్శకేంద్రుడు ఏమన్నారంటే....ఏ క్యారెక్టర్ అయినా చేయగలిగే నటీమణుల్లో అనుష్క ఒకరు. అది అరుంధతి అయినా, బాహుబలి అయినా, రుద్రమదేవి అయినా తన పాత్రలకు తగ్గట్టు ఒదిగిపోతూ తన నటనతో అందర్నీ ఆశ్చర్యపరుస్తూనే ఉంది. ఎప్పటి నుంచో తనకి నా సినిమాలో తగిన క్యారెక్టర్ వస్తే పని చేయాలని చూస్తున్నాను. ఇన్నాళ్లకు ఓం నమో వెంకటేశాయ ద్వారా జరిగింది. తన కెరీర్ లో మొదటిసారి భక్తురాలి పాత్ర పోషిస్తుంది. ఆ క్యారెక్టర్ లో తన అద్భుత నటన చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది మరియు కొత్తగా కన్పిస్తుంది. ఓం నమో వెంకటేశాయలో అనుష్క నాగార్జునకి జంటగా నటించడం లేదు అని తెలియచేసారు. ఇవి..తన మనసు దోచుకున్న కధానాయిక అనుష్క గురించి దర్శకేంద్రుడి మనసులో మాటలు...
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com