దర్శకేంద్రుడి మాటలకు దణ్ణం పెట్టిన మహేశ్, వంశీ.

  • IndiaGlitz, [Saturday,May 18 2019]

సూపర్‌స్టార్ మహేశ్ బాబు, పూజా హెగ్దే నటీనటులుగా వంశీపైడిపల్లి తెరకెక్కించిన చిత్రం 'మహర్షి'. మే-09న విడుదలైన ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్టయ్యింది. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఇప్పటికే సక్సెస్ మీట్ పూర్తి చేసుకున్న 'మహర్షి'.. శనివారం రోజున విజయవాడలోని సిద్ధార్థ కాలేజీలో గ్రాండ్ సక్సెస్ మీట్ చేసుకుంటున్నాడు.

ఈ వేడుకకు దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు హాజరై కార్యక్రమంలో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలు వెల్లడించారు. దర్శకేంద్రుడు మాట్లాడుతున్నంత సేపు మహేశ్ బాబు చప్పట్ల వర్షం కురిపించి.. దణ్ణం పెట్టారు. కాగా.. మహేశ్‌ను ‘రాజకుమారుడు’ సినిమాతో సినీ ఇండస్ట్రీకి పరిచయం చేసింది రాఘవేంద్రరావే అన్న విషయం తెలిసిందే.

దర్శకేంద్రుడి మాటల్లోనే.. సూపర్ స్టార్ క్రిష్ణ, బాబు అభిమానులకు పండుగ చేసుకుంటుంటే.. మహేశ్ మాత్రం 25 పండుగల ఒకేసారి చేసుకున్నారు. ముందుగా త్రిమూర్తులైన నిర్మాతలు దిల్‌రాజు, పీవీపీ.. బావగారు అశ్వనీదత్‌కు ఇంత పెద్ద హిట్ ఇచ్చినందుకు మనస్పూర్తిగా అభినందిస్తున్నాను. నేను వంద సినిమాలు తీసినప్పుడు ఎంత ఆనందపడ్డానో.. 25 సంవత్సరాల సందర్భంగా మహేశ్‌ను చూసి మీ నాన్నగారు అంతకంటే ఆనందపడుతున్నారు. (దర్శకేంద్రుడు ఈ మాటలు అనగానే మహేశ్ లేచి చప్పట్లు కొట్టి దణ్ణం పెట్టారు).

వంశీ.. మీరు చేసిన ప్రయత్నం.. ప్రజలు, సొసైటికీ అందరికీ ఉపయోగపడేలా మహేశ్‌ను బుషిలా చాలా అద్భుతంగా చేశావ్. కష్టాలు, స్నేహం, సీఈవో ఇలా అన్ని విషయాలు చాలా చక్కగా చూపించావ్. సంపాదించినది చివరికి రైతులకు ఇవ్వాలనేది చాలా అద్భుతంగా చూపించావు వంశీ. (దర్శకేంద్రుడి తన గురించి మాట్లాడుతున్నంత సేపు.. వంశీ డణ్ణం పెట్టేశారు). దేవీ శ్రీ ప్రసాద్ అద్భుతంగా సంగీతాన్ని అందించారు. నరేష్ చాలా బాగా నటించాడు.. కామెడీగానే ఇలా కూడా నటించొచ్చని ప్రూవ్ చేశావ్.. మీ నాన్నగారు ఉండుంటే చాలా గర్వపడేవారు.

హీరోయిన్ పూజా హెగ్దే పెద్ద హీరోయిన్ అవుతుందని ఎప్పుడో చెప్పాను. రాజకుమారుడు సినిమాను తెరకెక్కించేందుకు నాకు అవకాశం ఇచ్చిన కృష్ణగారికి, బావగారు అశ్వనీదత్‌కు ధన్యవాదాలు.. మహేశ్ మీకు థ్యాంక్స్ చెప్పలేను కానీ.. ఐయామ్ ప్రౌడ్.. రియల్లీ ప్రౌడ్. కొన్ని సినిమాలు.. కొన్ని డేట్స్ సినిమా చరిత్రలో అద్భుతమైన రికార్డ్స్ సృష్టిస్తాయ్.

ఏప్రిల్-28 నా జీవితంలో 'అడవి రాముడు', బాహుబలి రికార్డ్స్ సృష్టించాయి. అలాగే మే-09 'జగదేకవీరుడు అతిలోక సుందరి', 'మహానటి', ఇవాళ మే-09న ‘మహర్షి’ .. రికార్డ్స్‌ సృష్టించాయి. ఇక నుంచి మే-09ను ‘మహర్షి’-డే గా పిలుస్తారు. దిల్‌రాజు నిర్మించిన సినిమా అంతేగా.. అంతేగా అయ్యింది.. త్వరలోనే అనిల్ రావుపూడి దర్శకత్వంలోని సినిమా కూడా అంతేగా.. అంతేగా.. సూపర్ సిక్స్‌లు కొడుతుంది అని రాఘవేంద్రరావు చెప్పుకొచ్చారు.