రాఘవేంద్రరావు నటించడంలేదట

  • IndiaGlitz, [Wednesday,February 10 2016]

దర్శకుడు, నిర్మాతగా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు ఇప్పుడు నటుడుగా పరిచయం కాబోతున్నాడు. దిల్ రాజు నిర్మాతగా సతీష్ వెగ్నేశ దర్శకత్వంలో శతమానం భవతి అనే చిత్రం రూపొందనుంది. మూడు తరాలకు చెందిన కథతో రూపొందనున్న ఈ చిత్రంలో ముందు సాయిధరమ్ తేజ్ హీరోగా నటిస్తాడని అనుకున్నారు.

కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. సాయిధరమ్ తేజ్ స్థానంలో రాజ్ తరుణ్ నటిస్తున్నాడు. కాగా ఆసక్తికరమైన విషయమేమంటే ఈ చిత్రంలో రాఘవేంద్రరావు, తాత పాత్రలో నటిస్తాడని వార్తలు వినపడ్డాయి. అయితే లెటెస్ట్ న్యూస్ ప్రకారం రాఘవేంద్రరావు ఈ చిత్రంలో నటించడం లేదని విశ్వసనీయవర్గాల సమాచారం.