మాయాబజార్ ను ప్రారంభించిన దర్శకేంద్రుడు..
Send us your feedback to audioarticles@vaarta.com
మాయాబజార్ ప్రారంభించిన దర్శకేంద్రుడు అనగానే ఇదేదో కొత్త సినిమా అనుకుంటే...పొరపాటే. అన్నపూర్ణ స్డూడియోలో నాగార్జున అన్నపూర్ణ ఇంటర్నేషనల్ ఫిల్మ్ స్కూల్ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఫ్రాఫిట్ గురించి ఆలోచించకుండా ఇండియాలో బెస్ట్ ఫిల్మ్ స్కూల్ గా నిలవాలనే సదుద్దేశ్యంతో ఈ ఫిల్మ్ స్కూల్ ఏర్పాటు చేసారు.
ఈ స్కూల్ కు సంబంధించిన న్యూబ్లాక్ మాయాబజార్ ను దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు ప్రారంభించారు. ఈ న్యూబ్లాక్ లో క్లాస్ రూమ్, కిచెన్, మినీ ఆడిటోరియం, కాన్ఫిరెన్స్ రూమ్, స్టాఫ్ రూమ్ ఇలా... ఫిల్మ్ స్కూల్ స్టూడెంట్స్ కు కావలసిన సౌకర్యాలతో ఈ బ్లాక్ ను ఏర్పాటు చేసారు. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ...ఈ ఫిల్మ్ స్కూల్ లో చేరిన స్టూడెంట్స్ వాళ్ల రియల్ టాలెంట్ ఏమిటో తెలుసుకుని...వాళ్ల కలను నిజం చేసుకుంటారని ఆశిస్తున్నాను అన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com