రాఘవేంద్రుడి 'పెళ్లి సందడి' మళ్లీ మొదలు కాబోతోంది
Send us your feedback to audioarticles@vaarta.com
దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు అద్భుత సృష్టి ‘పెళ్లి సందడి’ గుర్తుంది కదా.. 1996లో శ్రీకాంత్ హీరోగా రాఘవేంద్రరావు రూపొందించిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపించింది. ఈ సినిమాతో శ్రీకాంత్ స్టార్ ఇమేజ్‌ను సొంతం చేసుకున్నాడు. ‘పెళ్లి సందడి మళ్లీ మొదలవబోతోంది.. తారాగణం త్వరలో..’ అంటూ రాఘవేంద్రరావు ట్విట్టర్ వేదికగా తెలిపారు. నిజానికి దర్శకేంద్రుడు కొంతకాలంగా సినిమాలేవీ రూపొందించలేదు. కానీ ఇటీవల త్వరలోనే ఓ న్యూస్ చెబుతానని ప్రకటించారు. చెప్పిన ప్రకారమే.. పెళ్లి సందడి మళ్లీ మొదలవబోతోందని చెప్పి షాక్ ఇచ్చారు.
దీని గురించి లిరిక్ రైటర్ చంద్రబోస్ కూడా ట్వీట్ చేశారు. 'మంచి పాటలతో..' అని చంద్రబోస్ ట్వీట్‌లో తెలిపారు. ఆర్.కె.ఫిలింస్, ఆర్కా మీడియా వర్క్స్ పతాకాలపై సినిమా రూపొందనుంది. ఎం.ఎం.కీరవాణ సంగీతం అందించనున్న ఈ చిత్రానికి శివశక్తిదత్తా, చంద్రబోస్ పాటలను రాస్తున్నారు. మాధవి కోవెలమూడి, శోభుయార్లగడ్డ, ప్రసాద్ దేవినేని ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. ఈ సినిమా కోసం నూతన నటీనటులను రాఘవేంద్రరావు ఎంచుకుంటారని సమాచారం. సినిమాకు సంబంధించిన మ్యూజిక్ ప్రొడక్షన్ ప్రారంభమైందని, త్వరలోనే నటీనటులెవరనే విషయాన్ని తెలియజేస్తామని ఆయన తెలిపారు.
రాఘవేంద్రరావు మళ్లీ పెళ్లి సందడి సినిమాను తెరకెక్కించనున్నట్టు చెప్పిన వార్త టాలీవుడ్‌లో సంచలనంగా మారింది. నటీనటుల గురించి చర్చ కూడా మొదలైంది. అంతేకాదు.. ఈ సినిమా కోసం దర్శకేంద్రుడు శ్రీకాంత్ తనయుడు రోషన్‌ను ఎంచుకున్నట్టు ఊహాగానాలు వెలువడుతున్నాయి. నాగార్జున నిర్మించిన 'నిర్మలా కాన్వెంట్' అనే సినిమా ద్వారా రోషన్ వెండితెరకు పరిచయమయ్యాడు. ఊహాగానాలు నిజమై ఒకవేళ దర్శకేంద్రుడు రోషన్‌ను ఎంచుకుంటే మాత్రం రోషన్ కెరీర్‌కి ఈ చిత్రం మంచి టర్నింగ్ పాయింట్ అవుతుందనడంలో ఎలాంటి సందేహమూ లేదు. మరి దర్శకేంద్రుడి మనసులో ఏ హీరో ఉన్నాడో ఆయన వెల్లడించే వరకూ వేచి చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments