Raghava Reddy:మాస్ అండ్ యాక్షన్ కమర్షియల్ ఎంటర్ టైనర్‌గా రూపొందుతోన్న ‘రాఘవ రెడ్డి’... ఆకట్టుకుంటోన్న ట్రైలర్

  • IndiaGlitz, [Friday,December 22 2023]

శివ కంఠనేని, రాశి, నందితా శ్వేత ప్రధాన పాత్రధారులుగా రూపొందుతోన్న చిత్రం ‘రాఘవ రెడ్డి’. స్పేస్ విజన్ నరసింహా రెడ్డి సమర్పణలో లైట్ హౌస్ సినీ మ్యూజిక్ బ్యానర్‌పై సంజీవ్ మేగోటి దర్శకత్వంలో K. S. శంకర్ రావ్, G. రాంబాబు యాదవ్, R. వెంకటేశ్వర్ రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. విడుదలకు సిద్ధమవుతోన్న ఈ సినిమా ట్రైలర్‌ను గురువారం మేకర్స్ విడుదల చేశారు.

‘రాఘవ రెడ్డి’ ట్రైలర్‌ను గమనిస్తే.. పక్కా మాస్ అండ్ కమర్షియల్ ఫార్మేట్ ఎలిమెంట్స్‌తో తెరకెక్కింది. సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ అయిన కథానాయకుడు.. తప్పు జరిగితే సహించని అతని వ్యక్తిత్వం కారణంగా డ్యూటీ పరంగా మంచి పేరు తెచ్చుకుంటాడు. అయితే వ్యక్తిగత జీవితంలో కొన్ని సమస్యలు వస్తాయి. ఆ సమస్యలేంటి? నిజాయతీగా ఉండటం వల్ల తను ఏం పోగొట్టుకున్నాడు? డ్యూటీలో తనెంత సిన్సియర్‌గా ఉంటాడు.. విలన్స్‌ని హీరో ఎలా భరతం పడతాడు.. ఇలాంటి ఎమోషనల్, యాక్షన్ అంశాలతో రాఘవరెడ్డి సినిమాను తెరకెక్కించారని అర్థమవుతుంది.

శివ కంఠనేని, రాశి, నందితా శ్వేత, పోసాని, అజయ్ ఘోష్, అజయ్, రఘుబాబు, శ్రీనివాస్ రెడ్డి వంటి స్టార్స్ తమదైన నటనతో ఆకట్టుకున్నారు. సంజీవ్ మేగోటి - సుధాకర్ మారియో సంగీత సారథ్యం వహించిన ఈ చిత్రానికి ఎస్.ఎన్.హరీష్ సినిమాటోగ్రఫీ అందించారు. కె.వి.రమణ ఆర్ట్ డైరెక్టర్‌గా వర్క్ చేశారు. జనవరిలో ఈ చిత్రాన్ని విడుదల చేయటానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.

నటీనటులు :- శివ కంఠంనేని, రాశి, నందిత శ్వేత, అన్నపూర్ణ, రఘుబాబు, శ్రీనివాస్ రెడ్డి , అజయ్ ,పోసాని కృష్ణమురళి, ప్రవీణ్ , అజయ్ ఘోష్, బిత్తిరి సత్తి, BHEL ప్రసాద్, మీనా వాసు, విజయ్ భాస్కర్, తేలు రాధాకృష్ణ, రాఘవరెడ్డి తదితరులు.

More News

AP Govt:ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో షాక్.. విశాఖ నుంచి పరిపాలన లేనట్లే..

ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కుదురైంది. విశాఖకు ప్రభుత్వ కార్యాలయాలను తరలించాలనుకున్న ప్రభుత్వ ప్రయత్నాలకు న్యాయస్థానం బ్రేక్ వేసింది.

YS Jagan Birthday: వరల్డ్ టాప్ ట్రెండింగ్‌లో సీఎం జగన్ బర్త్‌డే హ్యాష్‌ట్యాగ్

వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైయస్ జగన్ పుట్టినరోజును పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున సెలబ్రేట్ చేసుకున్నారు. వారం రోజుల ముందే అభిమానులు, కార్యకర్తలు సేవా కార్యక్రమాలతో పాటు సంబరాలు చేయడం మొదలుపెట్టారు.

Akbaruddin vs Revanth: అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి, అక్బరుద్దీన్ మధ్య పవర్ వార్

తెలంగాణ అసెంబ్లీలో విద్యుత్‌ రంగంపై చర్చ సందర్భంగా అధికార కాంగ్రెస్, మజ్లిస్ పార్టీల మధ్య మాటల యుద్ధం సాగింది. మజ్లిస్ పార్టీ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ మాట్లాడుతూ..

CM Jagan:మంచి చేస్తుంటే చంద్రబాబు, దత్తపుత్రుడు ఏడుస్తున్నారు: సీఎం జగన్

ప్రజలకు మంచి చేస్తున్న తనపై టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu), ఆయన దత్తపుత్రుడు పవన్ కల్యాణ్‌(Pawankalyan) దిగజారి మాట్లాడుతున్నారని సీఎం జగన్(CM

Kodali Nani: చంద్రబాబు, పవన్ కల్యాణ్‌, లోకేశ్‌పై కొడాలి నాని హాట్ కామెంట్స్

టీడీపీ యువనేత నారా లోకేష్ పాదయాత్ర ముగింపు సందర్భంగా నిర్వహించిన యువగళం విజయోత్సవ సభపై మాజీ మంత్రి కొడాలి నాని హాట్ కామెంట్స్ చేశారు.