ఫ్యాన్స్ వలే నేను కూడా ఆ మూవీ కోసం వెయిటింగ్ - లారెన్స్..!

  • IndiaGlitz, [Monday,December 19 2016]

ఫ్యాన్స్ వ‌లే నేను కూడా ఆ మూవీ కోసం వెయిటింగ్ అంటున్నారు మ‌ల్టీటాలెంటెడ్ ప‌ర్స‌న్ రాఘ‌వ లారెన్స్. ఇంత‌కీ లారెన్స్ వెయిటింగ్ ఏ మూవీ కోసం అంటారా..? మెగాస్టార్ చిరంజీవి 150 చిత్రం ఖైదీ నెం 150 కోసం. రాఘ‌వ లారెన్స్ ఈరోజు తిరుమ‌ల‌లో శ్రీవారిని ద‌ర్శించుకున్న అనంత‌రం మీడియాతో మాట్లాడుతూ ఈ విష‌యాన్ని తెలియ‌చేసారు. ఈరోజు ఉద‌యం వి.ఐ.పి ప్రారంభ ద‌ర్శ‌న స‌మ‌యంలో తిరుప‌తిలో శ్రీవారిని లారెన్స్ ఫ్యామిలీ మెంబ‌ర్స్ తో క‌లిసి ద‌ర్శించుకున్నారు.
ఈ సంద‌ర్భంగా లారెన్స్ మాట్లాడుతూ... శివ‌లింగ సినిమా షూటింగ్ పూర్తైన సంద‌ర్భంగా శ్రీవారిని ద‌ర్శించుకున్నాను. మూడేళ్ల క్రితం తిరుప‌తి వ‌చ్చాను. అప్ప‌టికీ ఇప్ప‌టికీ చాలా మార్పులు వ‌చ్చాయి. ఇక మెగాస్టార్ ఖైదీ నెం 150 గురించి చెప్పాలంటే..ఈ మూవీలో ఫ‌స్ట్ సాంగ్ నేనే చేసాను. ఫ్యాన్స్ వ‌లే నేను కూడా ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని ఎదురు చూస్తున్నాను అని చెప్పారు.

More News

డైరెక్ష‌న్ చేస్తానంటున్న చ‌ర‌ణ్ విల‌న్..!

మెగా ప‌వ‌ర్ రామ్ చ‌ర‌ణ్ న‌టించిన ధృవ‌ చిత్రంలో సిద్ధార్ధ అభిమన్యు పాత్ర‌లో స్టైలీష్ విల‌న్ గా న‌టించి మెప్పించిన హీరో ట‌ర్న‌డ్ విల‌న్ అర‌వింద్ స్వామి. త‌మిళ మూవీ త‌ని ఓరువ‌న్ రీమేక్ గా ధృవ రూపొందిన విష‌యం తెలిసిందే.

గౌతమీ ఆరోపణలు విచిత్రంగా అనిపిస్తున్నాయి - విజయశాంతి..!

లేడీ అమితాబ్ విజయశాంతి గత కొన్ని సంవత్సరాలుగా సినిమాలకు, రాజకీయాలకు దూరంగా ఉన్నారు. అయితే...దివంగత ముఖ్యమంత్రి జయలలితతో విజయశాంతికి మంచి అనుబంధం ఉంది.

ఆదా శ‌ర్మ అమ్మ‌ను చూస్తే షాక్ అవుతారు..!

హార్ట్ ఎటాక్ సినిమాతో తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మైన క‌థానాయిక ఆదాశ‌ర్మ‌. ఆత‌ర్వాత స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి, సుబ్ర‌మ‌ణ్యం ఫ‌ర్ సేల్, క్ష‌ణం త‌దిత‌ర చిత్రాల్లో న‌టించారు.

డిసెంబర్ 26న తిరుపతిలో గ్రాండ్ లెవల్లో 'గౌతమిపుత్ర శాతకర్ణి' ఆడియో విడుదల

కలియుగ దైవం శ్రీ తిరుమల వేంకటేశ్వరుడి పాదాల చెంతనున్న తిరుపతిలో నటసింహ నందమూరి బాలకృష్ణ నటించిన గౌతమిపుత్ర శాతకర్ణి ఆడియో ఆవిష్కరణ కానుంది.

ట్విట్టర్ లో రాజశేఖర్ ఎంట్రీ..కెసిఆర్ నిర్ణయానికి మద్దతు..!

యాంగ్రీ యంగ్ మెన్ రాజశేఖర్ ట్విట్టర్ లో ఎంట్రీ ఇచ్చారు.ఫస్ట్ ట్వీట్ అంటూ తెలంగాణ రాష్ట్ర సి.ఎం కెసిఆర్ నిర్ణయాన్ని సమర్ధిస్తూ ట్వీట్ చేసారు.