జనవరి 23న లారెన్స్ 'శివలింగ' టీజర్ విడుదల
- IndiaGlitz, [Saturday,January 21 2017]
కొరియోగ్రాపర్, డైరెక్టర్, హీరోగా తనదైన గుర్తింపు తెచ్చుకున్న లారెన్స్ హీరోగా పి.వాసు దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో అభిషేక్ ఫిలింస్ పతాకంపై రమేష్ పి. పిళ్లై శివలింగ ను తెరకెక్కిస్తున్న చిత్రం 'శివలింగ'.రితిక హీరోయిన్‌గా నటిస్తుంది. కన్నడ సూపర్‌స్టార్ శివరాజ్‌కుమార్ నటించిన కన్నడ సూపర్‌హిట్ మూవీ శివలింగ రీమేక్‌గా ఈ చిత్రం తెలుగు, తమిళంలో విడుదలవుతుంది. ఈ నెలలోనే ఈ సినిమా ఆడియో విడుదల చేద్దామని అనుకున్నారు. అయితే తమిళనాడులో జల్లికట్టుపై జరుగుతున్న పోరాటం కారణంగా ఆడియో విడుదలను వాయిదా వేశారు. అయితే అంత కంటే ముందు . జనవరి 23న ఈ సినిమా టీజర్‌ను విడుదల చేస్తున్నారు.
కథే హీరోగా కన్నడ లో బ్లాక్ బస్టర్ అయిన చిత్రం 'శివలింగ '. పి.వాసు గారి చంద్రముఖి, లారెన్స్ కాంచన , గంగ చిత్రాలను మించిన కథ, కథనాలతో హార్రర్ ఎంటర్ టైనర్ గా శివలింగ తెరకెక్కుతోంది.చిత్రీకరణ పూర్తయింది.నిర్మాణాంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సినిమా టీజర్‌ను జనవరి 23న విడుదల చేస్తున్నాం. అలాగే సినిమాను ఫిబ్రవరి లో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. హార్రర్ కాన్సెప్ట్ ల పరంగా శివలింగ నెక్ట్స్ లెవెల్ లొ ఉండే చిత్రమని నిర్మాతలు అన్నారు.