రాఘవ లారెన్స్ 'శివలింగ' సింగిల్ ట్రాక్ వస్తోంది..!

  • IndiaGlitz, [Thursday,January 05 2017]

కన్నడలో శివరాజ్ కుమార్ హీరోగా, పి.వాసు దర్శకత్వంలో గతేడాది సూపర్ హిట్ అయిన చిత్రం" శివలింగ ". ఇప్పుడు అదే" శివలింగ" పేరుతో తెలుగులో ఈ చిత్రం రీమేక్ అవుతోంది .లారెన్స్, రితికాసింగ్ జంటగా న‌టించిన ఈ చిత్రాన్ని దర్శకుడు పి.వాసు తెర‌కెక్కించారు.30 కోట్ల‌ భారీ బడ్జెట్ తో అభిషేక్ ఫిలింస్ పతాకం పై రమేష్ పి. పిళ్లై శివలింగను నిర్మించారు. ఎస్.ఎస్. థమన్ సంగీతాన్ని అందించిన ఈ సినిమా సింగిల్ ట్రాక్ ను శుక్రవారం యుట్యూబ్ లో విడుదల చేయనున్నారు.
ఈ సందర్బంగా నిర్మాత మాట్లాడుతూ... కథే హీరోగా కన్నడ లో బ్లాక్ బస్టర్ అయిన చిత్రం 'శివలింగ '. పి.వాసు గారి చంద్రముఖి, లారెన్స్ కాంచన , గంగ చిత్రాలను మించిన కథ, కథనాలతో హార్రర్ ఎంటర్ టైనర్ గా శివలింగ తెరకెక్కుతోంది. ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది.నిర్మాణాంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. తమన్ సంగీతాన్ని అందించిన సింగిల్ ట్రాక్ ను శుక్రవారం విడుదల చేయనున్నాం. త్వరలో పాటలను, ఫిబ్రవరిలో సినిమాను విడుదల చేస్తాం. హార్రర్ కాన్సెప్ట్ ల పరంగా శివలింగ నెక్ట్స్ లెవెల్ లో ఉండే చిత్రం అన్నారు.
రాఘ‌వ‌లారెన్స్‌, రితిక సింగ్‌, వ‌డివేలు, శ‌క్తివాసు, రాధార‌వి, జ‌య‌ప్ర‌కాష్‌, ప్ర‌దీప్ రావ‌త్ త‌దిత‌రులు న‌టిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్ర‌ఫీః స‌ర్వేష్ మురారి. మ్యూజిక్ః ఎస్‌.ఎస్‌.థ‌మ‌న్‌, సాహిత్యంః రామ‌జోగ‌య్య శాస్త్రి, ఆర్ట్ః దురైరాజ్‌, ఫైట్స్ః అన‌ల్ అర‌సు, దినేష్‌, ఎడిటింగ్ః సురేష్‌, నిర్మాతః ర‌మేష్‌.పి.పిళ్లై , దర్శకత్వం : పి.వాసు

More News

18వ సారి పోటీపడుతున్న చిరంజీవి - బాలకృష్ణ..!

మెగాస్టార్ చిరంజీవి నటించిన 150వ చిత్రం ఖైదీ నెం 150.డైనమిక్ డైరెక్టర్ వి.వి.వినాయక్ ఈ చిత్రాన్నితెరకెక్కించారు.

'డ్యూయెట్' రిలీజ్ డేట్....

మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన ఓకే బంగారం చిత్రాన్ని తెలుగులో

ట్రయినింగ్ తీసుకుంటున్న పూరి తనయుడు....

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తనయుడు ఆకాష్ ఇప్పుడు హీరోగా తెరంగేట్రం చేయడానికి అన్ని విధాలుగా సిద్ధమవుతున్నాడు.

నాని నేను లోక‌ల్ ఫ‌స్ట్ సాంగ్ రిలీజ్..!

నేచర‌ల్ స్టార్ నాని హీరోగా సినిమా చూపిస్త మావ ఫేమ్ న‌క్కిన త్రినాధ‌రావు ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న‌ చిత్రం నేను లోక‌ల్. ఈ చిత్రానికి అటిట్యూడ్ ఈజ్ ఎవ్రీథింగ్ అనేది క్యాప్ష‌న్. ఈ చిత్రం శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై దిల్ రాజు స‌మ‌ర్ప‌ణ‌లో రూపొందింది.

అనంత‌పురంలో రానా..!

ద‌గ్గుబాటి రానా హీరోగా తేజ ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం రూపొందుతుంది. ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్ పై సురేష్ బాబు నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఇప్ప‌టి వ‌ర‌కు 50% షూటింగ్ పూర్తి చేసుకుంది.