హార్ట్ స‌ర్జ‌రీ విజ‌య‌వంతం - లారెన్స్ సంతోషం..

  • IndiaGlitz, [Monday,March 14 2016]

గ్రూప్ డాన్స‌ర్ గా కెరీర్ ప్రారంభించి...కొరియోగ్రాఫ‌ర్ గా, హీరోగా, ద‌ర్శ‌కుడుగా, సంగీత ద‌ర్శ‌కుడిగా...ఇలా సినిమా రంగంలో త‌ను ప్ర‌వేశించిన ప్ర‌తి శాఖ‌లో విజ‌యం సాధించిన మ‌ల్టీ టాలెంటెడ్ ప‌ర్స‌న్ రాఘ‌వ లారెన్స్. ప్ర‌తి మ‌నిషిలో లోపం ఉంటుంది. కానీ..ఆ లోపం శాఫం కాకూడ‌దు అంటూ ఎంతో మంది విక‌లాంగుల‌కు అండ‌గా నిలిచిన గొప్ప మాన‌వ‌తావాది లారెన్స్. ఆప‌ద‌లో ఉన్న వారికి అండ‌గా నేనున్నాను అంటూ ఎప్పుడూ ముందుండే లారెన్స్ మరోసారి ముందుకు వ‌చ్చారు.

ఇప్ప‌టి వ‌ర‌కు 127 మందికి ఓపెన్ హార్ట్ స‌ర్జ‌రీ చేయించిన లారెన్స్ తాజాగా ఓ చిన్న‌పిల్లాడుకి ఓపెన్ హార్ట్ చేయించాడు. ఈ సంద‌ర్భంగా లారెన్స్ ట్విట్ట‌ర్లో స్పందిస్తూ...నా ఫ్యాన్స్ కి ఫ్రెండ్స్ కి గుడ్ న్యూస్. 128వ ఓపెన్ హార్ట్ స‌ర్జ‌రీ స‌క్సెస్ అయింది. నాకు చాలా సంతోషంగా ఉంది అంటూ స‌ర్జ‌రీ చేయించుక‌న్న బాబు ఫోటోను కూడా పోస్ట్ చేసారు. మొన్న చెన్నై న‌గ‌రానికి వ‌ర‌ద వ‌చ్చిన‌ప్పుడు కోటీ రూపాయ‌లు విరాళం ప్ర‌క‌టించాడు. లారెన్స్...నిజంగా గొప్ప మాన‌వ‌తావాది.