రాఘవేంద్ర లారెన్స్ హీరోగా పి.వాసు దర్శకత్వంలో అభిషేక్ ఫిలింస్ సినిమా
Send us your feedback to audioarticles@vaarta.com
కన్నడంలో సూపర్‌హిట్ అయిన శివలింగ చిత్రాన్ని అభిషేక్ ఫిలింస్ బ్యానర్‌పై రాఘవేంద్ర లారెన్స్, రితిక సింగ్ హీరో హీరోయిన్లుగా పి.వాసు దర్శకత్వంలో రమేష్ పి.పిళ్లై నిర్మిస్తున్నారు. ఒక సాంగ్ మినహా సినిమా చిత్రీకరణ అంతా పూర్తయ్యింది. ఈ సందర్భంగా మంగళవారం చిత్రయూనిట్ హైదరాబాద్ పార్క్ హయత్ హోటల్లో పాత్రికేయుల సమావేశాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో..
లారెన్స్ చాలా రిస్క్‌తీసుకుని నటించారు
దర్శకుడు పి.వాసు మాట్లాడుతూ - ``పదేళ్ల క్రితం కన్నడంలో నేను డైరెక్ట్ చేసిన ఆప్తమిత్ర చాలా పెద్ద హిట్ అయితే రజనీకాంత్‌గారు హీరోగా జ్యోతిక టైటిల్ పాత్రలో ఆప్తమిత్రనే చంద్రముఖిగా తెరకెక్కించాను. చంద్రముఖి తెలు, తమిళంలో పెద్ద హిట్ అయ్యింది. ఇప్పుడు అలాగే నేను కన్నడలో డైరెక్ట్ చేసిన శివలింగ అక్కడ సూపర్‌హిట్ అయ్యింది. 75 సెంటర్స్‌లో 100రోజులు ఆడింది. ఈ సినిమా వడివేలుగారు నటిస్తున్నారు. అలాగే మా అబ్బాయి శక్తివాసు ఈ చిత్రంలో కీలకపాత్రలో నటించాడు. తమిళంలో రవిచంద్రన్‌గారు సినిమాను నిర్మిస్తే తెలుగులో రమేష్‌గారు సినిమా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. శివ లింగ చిత్రాన్ని తెలుగు, తమిళంలో ఏక కాలంలో సినిమాను షూటింగ్ చేశాం. కాంచన, కాంచన2లకు రాఘవేంద్ర లారెన్స్ ఎంత రిస్కు తీసుకుని నటించాడో అంత కంటే ఎక్కువ రిస్కు తీసుకుని ఈ సినిమాలో యాక్ట్ చేశాడు. ఓ సాంగ్ మినహా సినిమా షూటింగ్ మొత్తం పూర్తయ్యింది`` అన్నారు.
కన్నడ కంటే తెలుగులో పెద్ద హిట్ కావాలి
రవిచంద్రన్ మాట్లాడుతూ - ``కన్నడలో శివలింగ సెన్సేషనల్ హిట్ సాధించింది. ఇప్పుడు తెలుగు, తమిళంలో వాసుగారి దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమా కన్నడం కంటే పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను`` అన్నారు.
నిర్మాత రమేష్ పి.పిళ్లై మాట్లాడుతూ - ``వాసుగారు, లారెన్స్‌గారి కాంబినేషన్లో రూపొందుతోన్న ఈ చిత్రం పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను`` అన్నారు.
డిసెంబర్ మొదటివారంలో ఆడియో
ఎస్.ఎస్.థమన్ మాట్లాడుతూ - ``నేను, లారెన్స్‌గారు చేసిన కాంచన, కాంచన2 సినిమాలు పెద్ద విజయాలు సాధించాయి. ఇప్పుడు మా కాంబినేషన్లో శివలింగ సినిమా రూపొందుతోంది. ఈ సినిమా జనవరిలో విడుదల కానుంది. వాసుగారి వంటి సీనియర్ దర్శకుడితో కలిసి వర్క్‌చేయడం ఆనందంగా ఉంది. సినిమాలో ఆరు పాటలున్నాయి. అన్నీ సాంగ్స్ బాగా వచ్చాయి. సర్వేష్ మురారిగారు అద్భుతమైన విజువల్స్ ఇచ్చారు. నిన్న హైదరాబాద్‌లో చిత్రీకరణ పూర్తయ్యింది. ఒక సాంగ్ మాత్రమే బ్యాలెన్స్ ఉంది. నవంబర్ 25 నుండి బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ స్టార్ట్ చేస్తాం. డిసెంబర్లో పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేస్తాం. జనవరిలో సినిమా రిలీజ్ ఉంటుంది. డిసెంబర్ మొదటి వారంలో ఆడియో విడుదల చేస్తున్నాం`` అన్నారు.
సినిమా చాలా బాగా వచ్చింది...
శక్తివాసు మాట్లాడుతూ - ``నేను తమిళం, కన్నడంలో సినిమాలు చేశాను. కన్నడ శివలింగలో నేను చేసిన కీ రోల్‌కు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు తెలుగు, తమిళంలో రూపొందుతోన్న రీమేక్‌లో ఇంపార్టెన్స్ ఉన్న పాత్రలో నటిస్తున్నాను. ఇదే తెలుగులో నేను చేస్తున్న తొలి సినిమా. సినిమాను పూర్తయ్యింది. ఒక సాంగ్ మాత్రమే బ్యాలెన్స్ ఉంది. అందరూ సినిమాను తప్పకుండా ఆదరించాలని కోరుకుంటున్నాను``అన్నారు.
చంద్రముఖి కంటే పెద్ద హిట్ అవుతుంది
సినిమాటోగ్రాఫర్ సర్వేష్ మురారి మాట్లాడుతూ - ``తమిళంలో పటాస్ రీమేక్ మొట్టశివ కెట్ట శివ చిత్రానికి నేనే సినిమాటోగ్రఫీ అందించాను. నా వర్క్ నచ్చడంతో ఈ సినిమా చేయడానికి అవకాశం వచ్చింది. సినిమా చాలా బాగా వచ్చింది. చంద్రముఖి కంటే పెద్ద హిట్ అవుతుంది`` అన్నారు.
రితిక సింగ్ మాట్లాడుతూ - ``వాసుగారు, లారెన్స్, సర్వేష్ మురారి, థమన్ వంటి మంచి టెక్నికల్ టీంతో కలిసి చేసే అవకాశం వచ్చింది. అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్`` అన్నారు.
ఈ సినిమాకు కథే హీరో
రాఘవేంద్ర లారెన్స్ మాట్లాడుతూ - ``కాంచన పెద్ద హిట్ అయ్యింది. కాంచన కంటే గంగ ఇంకా పెద్ద హిట్ అయ్యింది. గంగ కంటే పెద్ద హిట్ మూవీ చేయాలని ఎదురుచూస్తున్న సమయంలో వాసుగారు శివలింగ సినిమా చూడమన్నారు. చూడగానే నచ్చింది. సినిమాలో నటించడానికి ఒప్పుకున్నాను. ఈ సినిమాకు కథే మొదటి హీరో. రితిక సింగ్ రెండో హీరోయిన్, శక్తివాసు మూడో అయితే నేను నాలుగో హీరోఅవుతానంతే. సినిమా అంత మంచి కథతో రూపొందింది. చంద్రముఖి సినిమాలో రితికసింగ్‌కు ఎంత మంచి పేరు వచ్చిందో రితికకు అంత మంచి పేరు వస్తుంది. రితిక ఇంటర్వెల్ బ్లాక్‌లో చేసిన నటన చూసి థ్రిల్ అయ్యాను. ఇక దర్శకుడు వాసుగారు గురించి చెప్పాలంటే నా ఫేవరేట్ హీరో రజనీకాంత్‌ను డైరెక్ట్ చేసిన వాసుగారి దర్శకత్వంలో నటించడం ఆనందంగా ఉంది. సినిమాకు ప్రేక్షకుల ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను`` అన్నారు.
రాఘవలారెన్స్, రితిక సింగ్, వడివేలు, శక్తివాసు, రాధారవి, జయప్రకాష్, ప్రదీప్ రావత్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీః సర్వేష్ మురారి. మ్యూజిక్ః ఎస్.ఎస్.థమన్, సాహిత్యంః రామజోగయ్య శాస్త్రి, ఆర్ట్ః దురైరాజ్, ఫైట్స్ః అనల్ అరసు, దినేష్, ఎడిటింగ్ః సురేష్, నిర్మాతః రమేష్.పి.పిళ్లై, దర్శకత్వంః పి.వాసు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout