నాలుగో భాగం.. ముహుర్తం ఫిక్స‌య్యిందా?

  • IndiaGlitz, [Tuesday,December 12 2017]

లారెన్స్ రాఘ‌వ‌.. డ్యాన్స్ మాస్ట‌ర్‌గానూ, హీరోగానూ, డైరెక్ట‌ర్‌గానూ, మ్యూజిక్ డైరెక్ట‌ర్‌గానూ త‌న‌దైన ముద్ర‌వేసిన మ‌ల్టీటాలెంటెడ్ ప‌ర్స‌న్‌. మాస్ చిత్రంతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మైన లారెన్స్‌.. స్టైల్ చిత్రంతో క‌థానాయ‌కుడుగానూ, ద‌ర్శ‌కుడుగానూ స‌క్సెస్ అయ్యారు. స్టైల్‌తో పాటు హీరోగానూ, డైరెక్ట‌ర్‌గానూ లారెన్స్ స‌క్సెస్ అయ్యింది మాత్రం కాంచ‌న సిరీస్‌తోనే.

కాంచ‌న సిరీస్ లో మొద‌టి భాగ‌మైన ముని చిత్రం జ‌స్ట్ ఓకే అనిపించుకుంటే.. రెండో భాగం కాంచ‌న పెద్ద స‌క్సెస్ అయ్యింది. ఇక మూడో భాగం గంగ కూడా మంచి విజ‌యం సాధించింది. ఈ నేప‌థ్యంలో ఈ చిత్రానికి నాలుగో భాగంగా రూపొందుతున్న కాంచ‌న 3పై కూడా మంచి అంచ‌నాలే ఉన్నాయి. ఈ చిత్రంలో లారెన్స్ రాఘ‌వ‌కి జోడీగా వేదిక‌, ఓవియా హీరోయిన్స్‌గా న‌టిస్తున్నారు.

త‌న ద‌ర్శ‌క‌త్వంలోనే రూపొందుతున్న ఈ చిత్రాన్ని వేస‌వి కానుక‌గా తీసుకురావ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు లారెన్స్‌. తాజా స‌మాచారం ప్ర‌కారం.. ఈ సినిమా ఏప్రిల్ 6న విడుద‌ల కానుంద‌ని తెలుస్తోంది. నాలుగోభాగంతోనూ లారెన్స్ స‌క్సెస్ మూట‌గ‌ట్టుకుంటారేమో చూడాలి.