హండ్రెడ్ పర్సెంట్ ఎంటర్ టైన్ చేసే హార్రర్ సస్పెన్స్ థ్రిల్లర్ 'శివలింగ' - రాఘవ లారెన్స్
Send us your feedback to audioarticles@vaarta.com
కొరియోగ్రాఫర్‌గా, హీరోగా, డైరెక్టర్‌గా తనదైన గుర్తింపు సాధించుకున్నాడు రాఘవ లారెన్స్. అభిషేక్ ఫిలింస్ బ్యానర్‌పై రాఘవ లారెన్స్, రితిక సింగ్ హీరో హీరోయిన్లుగా పి.వాసు దర్శకత్వంలో రమేష్ పిళ్ళై నిర్మించిన చిత్రం 'శివలింగ'. ఈ సినిమా ఏప్రిల్ 14న విడుదలవుతుంది. పి.వాసుగారితో పనిచేయడం ఓ ఎక్స్‌పీరియెన్స్ అంటున్న హీరో రాఘవ లారెన్స్ సినిమాలతో పాటు తాను చేస్తున్న సామాజిక సేవలు గురించి కూడా తెలియజేశారు. ఈ సందర్భంగా రాఘవ లారెన్స్‌తో ఇంటర్వ్యూ...
'శివలింగ' ఎలా ఉంటుంది?
కన్నడంలో అల్రెడి ప్రూవ్ అయిన సినిమా. తెలుగు, తమిళంలో కూడా పి.వాసుగారే డైరెక్ట్ చేశారు. సినిమా చాలా బాగా వచ్చింది. కన్నడంలోలాగానే తెలుగు, తమిళంలో సినిమా పెద్ద హిట్ అవుతుంది. కాంచన, గంగ తరహాలో ప్రేక్షకులను హండ్రెడ్ పర్సెంట్ ఎంటర్టైన్ చేసే హార్రర్ సస్పెన్స్ థ్రిల్లర్ ఇది.
రితిక సింగ్‌తో కలిసి నటించడం తనతో వర్కింగ్ ఎక్స్‌పీరియెన్స్?
రితిక సింగ్ రోల్ చాలా బాగా వచ్చింది. ఈ సినిమాలో తనే హీరో అని నేను అందరికీ చెబుతున్నాను. తను మంచి ఫైటర్ అని అందరికీ తెలుసు. ఈ సినిమాతో తను మంచి డ్యాన్సర్‌గా కూడా పేరు తెచ్చుకుంటుంది. చాలా మంచి హార్డ్ వర్కర్. డ్యాన్స్ మాస్టర్, ఫైట్ మాస్టర్ అనేది డిఫరెంట్ కాంబినేషన్. ఇద్దరి మధ్య రిథమ్ అనే ఒకేలా ఉంది. 'గురు'లో తన రియల్ లైఫ్ క్యారెక్టర్‌కు దగ్గరగా ఉండే క్యారెక్టర్ చేసింది. 'శివలింగ'లో డిఫరెంట్‌గా చేసింది. ఇంటర్వెల్ బ్లాక్‌లో తనను చూసి ఇది నిజంగా రితికయేనా అని అనుకుంటారు. అంత అద్భుతంగా నటించింది. నేను, మా సంస్థల్లోని పిల్లలు దాదాపు అరవైమంది సినిమా చూశాం. సినిమా తర్వాత పిల్లలందరూ రితికకు పెద్ద ఫ్యాన్ అయ్యారు.
పి.వాసు దర్శకత్వంలో హీరోగా చేయడం వల్ల ఏం నేర్చుకున్నారు?
వాసుగారితో పనిచేయడం అంటే నేర్చుకోవడమే. ఈ వయసులో కూడా ఆయన స్పీడుగా ఉన్నారు. ప్రతి సీన్లో యాక్టింగ్ చేసి చూపిస్తున్నారు. ఆయన చెప్పినదాన్ని కాపీ కొడితే చాలు. చాలా కంఫర్ట్‌గా ఉంది. ఆయన దగ్గర ఓ సీన్‌ను ఎంత స్పీడుగా తీయవచ్చు, ఎంత క్వాలిటీగా ఇవ్వొచ్చు అనేది నేర్చుకున్నాను. ఆర్టిస్టుకు తగ్గట్లు ఫ్రేమింగ్ పెట్టారు. వాసుగారి దర్శకత్వంలో రజనీకాంత్‌గారు నటించిన ఉళపాలి అనే చిత్రంలో నేను గ్రూప్ డ్యాన్సర్‌గా చేశాను. అలాగే ఆయన డైరెక్షన్లో రూపొందిన కుచేలన్ సినిమాకు కొరియోగ్రఫీ చేశాను. ఇప్పుడు ఆయన దర్శకత్వంలో నేను హీరోగా సినిమా చేయడం అనేది ఆ రాఘవేంద్రస్వామి, మా అమ్మ ఆశీర్వాదంగా భావిస్తాను.
ఆలయాల నిర్మాణం ఎంత వరకు వచ్చింది?
రాఘవేంద్రస్వామి గుడిని, అలాగే గాయత్రి అమ్మవారి గుళ్ళను నిర్మించాను. గాయత్రి అమ్మవారి గుడిలో మా అమ్మగారి 5 అడుగుల విగ్రహాన్ని పెట్టాను. దీన్ని మే 1న ఓపెన్ చేస్తాం. ఈ అలయాలను నేను ఒక్కడినే నిర్మించాలని అనుకున్నాను. అయితే వాసుగారు ఒక వ్యక్తి అలయాన్ని నిర్మించడం మంచిది కాదని చెప్పడంతో ఆయన దగ్గరే ఒక లక్ష రూపాయల చందా తీసుకున్నాను, ఆర్.బి.చౌదరిగారు 50 వేల రూపాయలు చందా ఇచ్చారు. చిరంజీవి అన్నయ్య మూడు లక్షల రూపాయలు చందా ఇచ్చారు.
అమ్మ కోసం గుడి కట్టాలనే ఆలోచన ఎందుకు వచ్చింది?
నేను ఈరోజు ఇలా మీ ముందు కూర్చొని ఉన్నానంటే అందుకు కారణం మా అమ్మగారే. పన్నెండేళ్ళ వయసులో నాకు బ్రెయిన్ ట్యూమర్ వచ్చినప్పుడు అమ్మ ఎంతో కష్టపడింది. నన్ను ఎత్తుకుని తిరిగింది. మా అమ్మ నాకు బెస్ట్ ఫ్రెండ్. నా సినిమా స్క్రిప్టులన్నీ మా అమ్మకు చెబుతుంటాను. ఆమె సలహాలు తీసుకుంటాను. యోగ చేయడం, బ్రహ్మ ముహుర్తంలో నిద్ర లేవడం అన్నీ అమ్మ నుండే నేర్చుకున్నాను. దేవుడు ఎక్కడో ఉండడు. అమ్మ రూపంలో మన ముందే ఉంటుంది. నేను ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పిల్లలకు డ్యాన్స్ నేర్పించాలన్నా అమ్మనే అడిగాను. ఆమె ఒప్పుకోకపొతే నేను ఎలా ఇన్ని పనులు చేయగలుగుతాను. పది మంది పిల్లలకు డ్యాన్స్ నేర్పించడం స్టార్ట్ చేశాను. ఇప్పుడు వంద మంది పిల్లలు అయ్యారు. స్టార్టింగ్‌లో అమ్మ అందరికీ వంట వండి పెట్టేది. పిల్లలు ఎక్కువ కావడంతో నా స్వంత ఇంటిని ట్రస్ట్‌గా మార్చేసి, అద్దె ఇంటికి వెళ్ళిపోయాం. ఇన్ని పనులు అమ్మ ఒప్పుకోకపోతే నేను ఎలా చేయగలను.
ఈ ట్రస్ట్ ద్వారా ఎలాంటి సేవలు అందిస్తున్నారు?
136 మంది పిల్లలకు ఓపెన్ హార్ట్ సర్జరీలు చేయించాం. 60 మంది పిల్లలకు ఆశ్రయం ఇస్తున్నాను. అలాగే 200 స్లమ్‌లోని పిల్లలను కాన్వెంట్లో చదివిస్తున్నాను. వారి చదువు వ్యవహారమంతా మా ట్రస్ట్ చూసుకుంటుంది. ఇంకో బ్యాచ్ రెడీ అవుతుంది. హిజ్రాలకు, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ వ్యక్తులకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నాను. హిజ్రాలకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండటమే కాకుండా, కాంచన సినిమా తర్వాత హిజ్రాలకు నా వంతుగా సహాయం చేస్తున్నాను. వారు పుట్టడమే శాపంగా భావిస్తున్నారు, కానీ వారికి నమ్మకం కలిగించడం కోసం నా ఇంట్లో ఏదైనా మంచి కార్యం చేయాలనుకున్నప్పుడు వారితో పూజలు చేయిస్తున్నాను. వారికి డబ్బు సాయం చేస్తున్నాను. నా సినిమా స్టార్ట్ అయితే కొంత డబ్బు ఇస్తున్నాను. నన్ను చూసి నా ఫ్రెండ్స్ అంతా కూడా హిజ్రాలకు అర్ధికంగా సహాయం చేస్తున్నారు. అలాగే వారికి బ్రాండ్ అంబాసిడర్‌గా కూడా నన్ను నియమించుకోమని అన్నాను. నా ట్రస్ట్‌లో ఏదైనా కార్యక్రమాలు ఉన్నప్పుడు వారు ముందుంటున్నారు. నా ట్రస్టులో ముగ్గురు హిజ్రాలు పనిచేస్తున్నారు. బయట కూడా వారికి పని ఇప్పిస్తున్నాం. వచ్చే నెల హిజ్రాలతో ఢిల్లీలో షో చేస్తున్నాం.
తదుపరి చిత్రాలు..?
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments