లారెన్స్ హీరోగా కొత్త చిత్రం

  • IndiaGlitz, [Thursday,March 26 2020]

రాఘ‌వ లారెన్స్ హీరోగా కొత్త చిత్రం ప్రారంభం కానుంది. ఆస‌క్తిక‌ర‌మైన విష‌యేమంటే.. మ‌ల‌యాళంలో ఘ‌న విజ‌యం సాధించిన ‘అయ్య‌ప్ప‌నుమ్ కోశియ‌మ్‌’ త‌మిళ రీమేక్‌గా రూపొంద‌నున్న చిత్ర‌మిది. ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. అందులో భాగంగా లారెన్స్ న‌టించ‌నుండ‌గా ఆయ‌న స‌ర‌స‌న ప్రియా భ‌వానీ శంక‌ర్ జ‌త క‌ట్ట‌నున్నారు. బుల్లి తెర నుండి వెండితెర‌పైకి అడుగు పెట్టిన ప్రియా భ‌వానీ శంక‌ర్ మంచి అవకాశాల‌ను అందిపుచ్చుకుంటుంది. ఇప్పుడు లారెన్స్ స‌ర‌స‌న న‌టించ‌నుంది.

ప్ర‌స్తుతం రాఘ‌వ లారెన్స్ ద‌ర్శ‌కుడిగా అక్ష‌య్ కుమార్ హీరోగా ల‌క్ష్మీ బాంబ్ సినిమా తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. లారెన్స్ ద‌ర్వ‌క‌త్వంలో రూపొందిన కాంచ‌న చిత్రం తెలుగు, త‌మిళంలో ఘ‌న విజ‌యాన్ని సాధించిన సంగ‌తి తెలిసిందే. ఆ కాంచ‌న చిత్రానికి రీమేకే ల‌క్ష్మీ బాంబ్‌. ఈ సినిమా 22 మే విడుల కానుంది. మ‌రి దీనిపై క‌రోనా ప్ర‌భావం ఏమైనా ఉండి విడుద‌ల ఆల‌స్య‌మ‌వుతుందేమో తెలియ‌డం లేదు. కాగా.. ఈ సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. ఈ కార్య‌క్ర‌మాలు పూర్తయిన త‌ర్వాతే లారెన్స్ హీరోగా న‌టించే సినిమా ప్రారంభం అవుతుంద‌ని కోలీవుడ్ వ‌ర్గాలు అంటున్నాయి.

More News

కరోనా నేపథ్యంలో ఇటలీలో తెలుగు గాయనికి నరకం!

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. ఇప్పటికే ఈ వైరస్ భారీన పడి వేలాది మంది చనిపోగా.. లక్షలాది మంది అనుమానితులుగా ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

మెగాస్టార్ చిరంజీవి తొలి ట్వీట్ ఇదే

మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చారు. ఉగాది సంద‌ర్భంగా తాను సోషల్ మీడియాలోకి ఎంట‌ర్ అవుతున్నాన‌ని ఆయ‌న తెలియ‌జేసిన సంగ‌తి

'ఆర్ ఆర్ ఆర్' అంచ‌నాల‌ను పెంచేస్తున్న మోష‌న్ పోస్ట‌ర్‌

ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్.ఎస్‌.రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ప్రెస్టీజియ‌స్ మూవీ ‘ఆర్ఆర్ఆర్‌’. బాహుబ‌లి త‌ర్వాత రాజ‌మౌళి తెర‌కెక్కిస్తోన్న చిత్రం కావ‌డంతో సినిమాపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి.

ప్రజా ప్రతినిధులకు వార్నింగ్.. రైతన్నకు అభయం!

కరోనా మహమ్మారి విజృంభణ నేపథ్యంలో ప్రజాప్రతినిధులు సరిగ్గా పనిచేయట్లేదని.. రేపట్నుంచి రంగంలోకి దిగి క్రియాశీలకంగా పనిచేయాలని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఈ క్రమంలో రైతన్నలకు కేసీఆర్ శుభవార్త చెప్పారు.

21 రోజుల పాటు ఇండియా లాక్‌డౌన్..: మోదీ

కరోనా నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ‘జనతా కర్ఫ్యూ’ ప్రకటించిన కేంద్రం.. తాజాగా మరో సంచలన నిర్ణయమే తీసుకుంది. ఇవాళ అనగా మంగళవారం అర్థరాత్రి నుంచి దేశం మొత్తాన్ని