నా మాటలకు రజినీకాంత్‌గారికి సంబంధం లేదు: రాఘవ లారెన్స్
Send us your feedback to audioarticles@vaarta.com
ఇటవల జరిగిన `దర్బార్` ఆడియో వేడుకలో తాను మాట్లాడిన మాటలకు, రజినీకాంత్‌గారికి సంబంధం లేదు అని అన్నారు రాఘవ లారెన్స్. ఈ ఆడియో వేడుకలో కమల్‌హాసన్‌ను ఉద్దేశించి లారెన్స్ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే లేపాయి. కమల్ అభిమానులు లారెన్స్‌ను ట్రోల్ చేశారు. కమల్‌హాసన్‌ను కలిసి లారెన్స్ దిద్దుబాటు చర్యలు చేపట్టినా కూడా సమస్య సద్దుమణగలేదు. దీంతో తాజాగా లారెన్స్ మరో ప్రకటన చేశాడు. ``దర్బార్ ఆడియో తర్వాత నాకు పలువురు మిత్రులు ఫోన్ చేసి ఇంటర్వ్యూ అడిగారు. ప్రస్తుతం హిందీ సినిమాతో బిజీగా ఉన్నాను. అందువల్ల మాట్లాడలేకపోతున్నాను.
సినిమా పూర్తయ్యాక అందరికీ ఇంటర్వ్యూలు తప్పకుండా ఇస్తాను. ఇది వరకు నేను చేసిన ట్వీట్లు, నేను మాట్లాడిన విషయాలు, భవిష్యత్తులో మాట్లాడే విషయాలకు రజినీకాంత్‌గారికి సంబంధం లేదు. నా అభిప్రాయాలతో ఆయనకు సంబంధం ఉండదు. ఆయన చెబితేనే నేను అలా వేదికలపై మాట్లాడుతున్నానని కొందరు అభిప్రాయ పడుతున్నారు. కానీ రజినీకాంత్‌గారు అలా మాట్లాడించే వ్యక్తి కాదు. నేను ఏ పార్టీకి వ్యతిరేకం కాదు. రాజకీయంగా నేను ఎవరికీ మద్దతు ఇవ్వలేదు. నాకు రాజకీయాలతో సంబంధం లేదు. నా మార్గంలో నేను వెళుతున్నాను. ఇప్పుడు నా సేవా కార్యక్రమాలు గురించి పలువురు ప్రశ్నిస్తున్నారు. వాటిని ప్రశాంతంగా సమాధానమిస్తాను`` అన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout