రాధిక‌కు త‌ప్పిన ముప్పు

  • IndiaGlitz, [Sunday,April 21 2019]

సీనియ‌ర్ న‌టి రాధిక‌కు పెను ప్ర‌మాదం త‌ప్పింది. ఈమె వ్య‌క్తిగ‌త ప‌నుల రీత్యా శ్రీలంకకు వెళ్లారు. అక్క‌డ సిన్నామ‌న్ గ్రాండ్ హోట‌ల్‌లో బ‌స చేశారు. ఉద‌యం ఎనిమిదిన్న‌ర గంట‌లకు ముందుగానే చెన్నై బ‌య‌లుదేరేశారు. ఆమె బ‌య‌లుదేరిన కొద్దిసేప‌టికే సిన్నామ‌న్ హోటల్లో బాంబ్ బ్లాస్ట్ జ‌రిగింది. దీంతో పాటు వ‌రుస‌గా ఆరుచోట్ల బాంబు పేలుళ్లు జ‌రిగాయి. ఈ పేలుళ్ల‌లో 50 మంది చ‌నిపోగా.. 200కుపైగా గాయ‌ప‌డ్డారు. ఈస్ట‌ర్ డే సంద‌ర్భంగా ప్రార్థ‌న‌ల‌కు వ‌చ్చిన భ‌క్తుల‌ను ట్రెర్ర‌రిస్టులు టార్గెట్ చేశారు. దాని ఫలిత‌మే ఈ బాంబు బ్లాస్టులు. ఈ విష‌యం తెలిసిన రాధికా ట్విట్ట‌ర్ ద్వారా త‌ను ప్ర‌మాదం నుండి త‌ప్పించుకున్న విష‌యాన్ని తెలిపారు.

''ఓమైగాడ్ శ్రీలంక‌లో బాంబు బ్లాస్ట్స్‌.. దేవుడు నాతోనే ఉన్నాడు. నేను చిన్నామ‌న్ గ్రాండ్ హోట‌ల్ నుండి బ‌య‌ట‌కు వ‌చ్చేసిన త‌ర్వాత బ్లాస్టులు జ‌రిగాయి. న‌మ్మలేక‌పోతున్నా.. షాకింగ్‌గా ఉంది'' అని తెలిపారు రాధికా శ‌ర‌త్‌కుమార్‌.