రాధిక దంపతులకు ఏడాది జైలు శిక్ష

తమిళ నటుడు శరత్ కుమార్, అతని భార్య, నిర్మాత రాధికా శరత్ కుమార్‌లకు చెక్ బౌన్స్ కేసులో ఏడాది పాటు జైలు శిక్ష పడింది. చెన్నైలోని సైదాపేట కోర్టు వారిద్దరికీ శిక్షను విధిస్తూ తీర్పును వెలువరించింది. 2017నాటి చెక్ బౌన్స్ కేసులో ఇరువురికీ న్యాయస్థానం ఏడాది శిక్ష విధించింది. అసలు విషయంలోకి వెళితే... గతంలో రాధిక, శరత్ కుమార్ దంపతులు.. మరో నిర్మాత లిస్టిన్ స్టీఫెన్‌తో కలిసి సంయుక్తంగా సినిమాలను నిర్మించేవాళ్లు.

ఈ క్రమంలోనే రేడియన్స్‌ మీడియా ప్రైవేటు లిమిటెడ్‌ సంస్థ నుంచి ఓ సినిమా కోసం వీరివురూ పెద్ద మొత్తంలో డబ్బును అప్పుగా తీసుకున్నారు. అయితే తీసుకున్న అప్పును సమయానికి తీర్చలేక పోగా... అప్పు చెల్లించేందుకు 2017లో రేడియన్స్‌ సంస్థకు చెక్‌ అందజేయగా.. అది కాస్త బౌన్స్‌ అయ్యింది. దీంతో రేడియన్స్‌ సంస్థ కోర్టును ఆశ్రయించింది. ఈ కేసులో 2019లో అరెస్ట్ వారెంట్ కూడా జారీ అయ్యింది. తాజాగా ఆ కేసును విచారించిన కోర్టు రాధిక దంపతులకు ఏడాది పాటు జైలు శిక్షను విధిస్తూ తీర్పును వెలువరించింది.

More News

ఉత్కంఠకు తెర.. ఏపీలో పరిషత్ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్

జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలపై ఉత్కంఠకు తెరపడింది. రాష్ట్రంలో పరిషత్ ఎన్నికల ప్రక్రియను నిలిపివేస్తూ హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన ఆదేశాలను డివిజన్ బెంచ్ కొట్టేసి..

ఆర్జీవికి డెత్ డే విషెస్ అంటూ ఓ ఆటాడుకుంటున్న నెటిజన్లు

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏం చేసినా సంచలనమే. ఆయన సినిమాల కాదు.. ఆయన కూడా తన ట్వీట్ల ద్వారా ప్రత్యేకంగా నిలుస్తుంటారు.

దేశంలో రికార్డ్ స్థాయిలో కరోనా కేసులు..

భారత్‌ను సెకండ్ వేవ్ తీవ్ర స్థాయిలో కలవరపెడుతోంది. ఊహించని స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. గత ఏడాది కూడా చూడనంతగా.. రికార్డ్ స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. అంతా ప్రశాంతం

తమన్నా ‘లెవెన్త్ అవర్’ ట్రైలర్ అదిరిపోయింది..

కోవిడ్ మహమ్మారి పుణ్యమా అని ఓటీటీల హవా బీభత్సంగా పెరిగిపోయింది. లాక్‌డౌన్ అనంతరం థియేటర్లు తెరుచుకున్నప్పటికీ ఓటీటీ కంటెంట్‌కు మాత్రం క్రేజ్ తగ్గలేదు. ప్రస్తుతం తెలుగు ప్రేక్షకులకు అమెజాన్ ప్రైమ్

సినీ థియేటర్లకు జగన్ సహకారం.. ధన్యవాదాలు చెప్పిన చిరు

కోవిడ్ మహమ్మారి కారణంగా తీవ్ర నష్టపోయిన పరిశ్రమల్లో సినీ పరిశ్రమ ఒకటి. ఇప్పుడిప్పుడే కాస్త కోలుకుంటున్న దీనికి తాజాగా ఏపీ ప్రభుత్వం సైతం తన సహకారాన్ని అందించి