రాధిక భర్తకు దూరంగా ఉంటోందా?
Monday, July 10, 2017 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
కన్నడ నటి రాధిక తన భర్త కుమారస్వామికి దూరంగా ఉంటోందా?.. అవుననే పలువురు అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామిని రాధిక 2006లో పెళ్లి చేసుకున్నట్టు ప్రకటించారు. వీరిద్దరికీ షామిక కె.స్వామి అనే కుమార్తె కూడా ఉంది. హీరోయిన్గా కన్నడ చిత్రాల్లో ఓ వెలుగు వెలిగిన రాధిక ఆ తర్వాత కుమారస్వామిని పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమయ్యారు. హీరోయిన్గా దూరమైనప్పటికీ అడపాదడపా చిన్న చిన్న పాత్రల్లో నటించేవారు. అవి అంతటి ప్రాధాన్యత ఉన్న పాత్రలు కావు. కుమారస్వామికి ఈమె రెండో భార్య. రాధికకు కూడా కుమారస్వామి రెండో భర్త. అంతకు ముందు ఆమె రతన్‌కుమార్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్నారు.
అయితే అతను గుండెపోటుతో మరణించారు. ఇదిలా ఉండగా ఇప్పుడు రాధిక, కుమారస్వామి కూడా విడిపోయారనే వార్తలు వినిపిస్తున్నాయి. కుమారస్వామితో విడిపోవడం వల్లనే రాధిక మరలా హీరోయిన్గా నటించడానికి అంగీకరిస్తున్నట్టు సమాచారం. అయితే ఈ విషయంపై అటు రాధికగానీ, ఇటు కుమారస్వామిగానీ ఇంకా నోరు విప్పలేదు. తాజా సమాచారం ప్రకారం రాధిక రవిచంద్ర దర్శకత్వంలో ఓ చిత్రంలో నటించడానికి అంగీకారం తెలిపారు. ఈ మధ్య తన కుమారుడు నిఖిల్‌తో కుమారస్వామి జాగ్వార్‌ను రూపొందించిన సంగతి తెలిసిందే. కుమారస్వామి పెద్ద భార్య కుమారుడు నిఖిల్.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments