Radhika Apte : హీరోల రెమ్యూనరేషన్‌పై రాధిక ఆప్టే సంచలన వ్యాఖ్యలు

  • IndiaGlitz, [Monday,April 10 2023]

రాధికా ఆప్టే.. ఈ పేరు గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. అందం , అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది ఈ అమ్మడు. చిత్ర పరిశ్రమలోని ఫైర్ బ్రాండ్ నటీమణుల్లో ఆమె కూడా ఒకరు. మనసులో వున్న ఏ విషయాన్నైనా కుండబద్ధలు కొట్టి చెప్పడంలో రాధిక దిట్ట. అవతలి వ్యక్తి ఎంతటి వాడైనా , ఏ స్థాయి వ్యక్తయినా ఆమె ఆలోచించదు. ఎన్నోమార్లు సంచలన వ్యాఖ్యలు చేసి వివాదాలు సృష్టించింది. ఇక దక్షిణాదికి చెందిన పలువురు ప్రముఖులపైనా ఆమె సంచలన వ్యాఖ్యలు చేసింది. బోల్డ్ క్యారెక్టర్లతో పాటు నటనకు ప్రాధాన్యం వున్న పాత్రలు చేస్తోంది. తాజాగా రాధిక ఆప్టే హీరో, హీరోయిన్ల రెమ్యూనరేషన్లపై హాట్ కామెంట్స్ చేసింది.

సినిమాకు 3 కోట్లు తీసుకుంటున్న రాధిక:

ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాధిక ఆప్టే మాట్లాడుతూ.. మహిళలు సినిమా రంగంలో పాపులారిటీ, రెమ్యూనరేషన్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని పేర్కొంది. ఇది అందరూ స్వాగతించాల్సిన విషయమని ఆమె అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం తనకు లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో అవకాశాలు ఎక్కువగా వస్తున్నాయని రాధిక తెలిపారు. హీరో, హీరోయిన్ల క్రేజ్ ఆధారంగానే రెమ్యూనరేషన్ ఇస్తారని ఆమె చెప్పారు. ఇకపోతే.. ప్రస్తుతం రాధిక ఆప్టే 3 నుంచి 5 కోట్ల రూపాయల రేంజ్‌లో తీసుకుంటున్నట్లుగా ఫిలింనగర్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

సినిమాలు, వెబ్ సిరీస్‌లతో రాధిక బిజీ:

ఇక సినిమాల విషయానికి వస్తే.. రాధిక ఆప్టే నటించిన ఫోరెన్సిక్, విక్రమ్ వేద, మోనికా ఓ మై డార్లింగ్ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఈ ఏడాది రాధిక నటించిన అండర్ కవర్ ఏప్రిల్ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది.

More News

Pawan Kalyan:పవన్ చేతికి తాబేలు ఉంగరం గమనించారా.. ఈసారి జనసేనాని జ్యోతిష్యాన్ని నమ్ముకున్నారా..?

పవన్ కల్యాణ్ ప్రస్తుతం సినిమాలు, రాజకీయాలతో ఫుల్ బిజీ. చేతిలో వున్న సినిమాలను పూర్తి చేసి 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధం

Game On:సమ్మర్‌లో ‘గేమ్‌ఆన్‌’

గీతానంద్‌, నేహా సోలంకి జంటగా నటిస్తోన్న చిత్రం ‘గేమ్‌ ఆన్‌’. కస్తూరి క్రియేషన్స్‌ ప్రొడక్షన్‌, గోల్డెన్‌ వింగ్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్స్‌పై దయానంద్‌ దర్శకత్వంలో

Kiran Kumar Reddy : బీజేపీలో కిరణ్ కుమార్ రెడ్డికి కీలక పదవి.. కర్ణాటక ఎన్నికల బాధ్యతలు కూడా..?

కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరిన మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డికి కమలనాథులు కీలక బాధ్యతలు  కట్టబెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.

PM Narendra Modi:సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్‌‌ను ప్రారంభించిన మోడీ.. కేసీఆర్ ఫ్యామిలీపై విమర్శలు

సికింద్రాబాద్ - తిరుపతి మధ్య కొత్తగా ఏర్పాటు చేసిన వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను శనివారం ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు.

Malls and Shop:తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. ఇకపై 24 గంటలూ షాపులు, మాల్స్‌ ఓపెన్

సాధారణంగా ఎక్కడైనా దుకాణాలు ఉదయం 10 గంటలకు తెరచుకుని రాత్రి 10 .. కొన్ని చోట్ల 11 గంటల వరకు అందుబాటులో వుంటాయి.