రాధేశ్యామ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు చీఫ్ గెస్ట్‌లు ఎవరో తెలుసా..?
Send us your feedback to audioarticles@vaarta.com
బాహుబలి, సాహో తర్వాత పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న చిత్రం రాధేశ్యామ్. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రోడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటోంది. సంక్రాంతి కానుకగా జనవరి 14న రాధేశ్యామ్ థియేటర్స్‌లో సందడి చేయనుంది. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తుండగా.. కృష్ణంరాజు సమర్పణలో వంశీ, ప్రమోద్, ప్రసీధలు నిర్మిస్తున్నారు. విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో చిత్ర యూనిట్ ప్రమోషనల్ కార్యక్రమాల్లో వేగం పెంచింది. దీనిలో భాగంగా ఈ నెల 23న హైదరాబాద్‌లో రాధేశ్యామ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది.
అంతా బాగానే వుంది కానీ.. ఈ మధ్యకాలంలో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్లకు బడా స్టార్లు చీఫ్ గెస్ట్‌లుగా వచ్చి సందడి చేశారు. మరి ప్రభాస్ కోసం ఎవరు రానున్నారనే చర్చ అభిమానుల్లోనూ, పరిశ్రమలోనూ మొదలైంది. తొలుత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అతిథిగా రాబోతున్నట్లు ప్రచారం జరిగింది. అయితే చిత్ర యూనిట్ దీనిని ఖండించింది. తాజా అప్‌డేట్ ప్రకారం.. రాధేశ్యామ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు అభిమానులే అతిథులుగా హాజరుకానున్నారు. 5 భాషలకు సంబంధించిన ఈ సినిమా ట్రైలర్స్‌ని ప్రభాస్ ఫ్యాన్స్ చేతులమీదుగా రిలీజ్ చేయనున్నారు మేకర్స్. ప్రస్తుతం ఒమిక్రాన్ తీవ్రత నేపథ్యంలో కోవిడ్ నిబంధనలు పాటించి, ఈ వేడుకకు రావాలని చిత్రయూనిట్ విజ్ఞప్తి చేసింది.
మరోవైపు వరుస సినిమాలతో బిజీగా వున్న పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మరో ప్రాజెక్ట్‌ని పట్టాలెక్కించారు. మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘‘ప్రాజెక్ట్ కే’’ (వర్కింగ్ టైటిల్) షూటింగ్‌ను స్టార్ట్ చేశాడు. ఇందులో ప్రభాస్ సరసన బాలీవుడ్ ముద్దుగుమ్మ దీపికా పదుకోణే హీరోయిన్‌గా నటిస్తుండగా... బిగ్ బి అమితాబ్ బచ్చన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమా రెగ్యూలర్ షూటింగ్‌ని చిత్ర యూనిట్ శనివారం ప్రారంభించింది.
దీనితో పాటు `సలార్`, `ఆదిపురుష్` చిత్రాల్లో నటిస్తున్నారు ప్రభాస్. `ఆదిపురుష్`ను వచ్చే ఏడాది ఆగస్ట్ 11న విడుదల చేయబోతున్నారు. ఈ చిత్రాన్ని బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కిస్తున్నారు. ఇందులో కృతి సనన్ సీతగా, సైఫ్ అలీ ఖాన్ రావణుడి పాత్రని పోషిస్తున్నారు. మరోవైపు కేజీఎఫ్ ఫేం ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న `సలార్`లో శృతి హాసన్ కథానాయికగా నటిస్తుంది. అలాగే ప్రభాస్ తన 25వ చిత్రం ‘‘స్పిరిట్’’ను సెట్స్‌పైకి తీసుకెళ్లే ప్లాన్‌లో వున్నారు. అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com