రాధేశ్యామ్ ఎన్ఎఫ్‌టి లాంచ్ నేడే: ఆ 100 మందికి ప్రభాస్‌ను కలిసే ఛాన్స్, త్వరపడండి
Send us your feedback to audioarticles@vaarta.com
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్- పూజా హెగ్డే నటించిన ‘‘రాధేశ్యామ్’’ ఎట్టకేలకు రిలీజ్‌కు రెడీ అవుతోంది. కోవిడ్ కారణంగా వాయిదాపడిన ఈ సినిమా మార్చి 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేసింది. ఇప్పటికే ప్రభాస్, పూజాహెగ్డేలు వరుస ఇంటర్వ్యూలతో బిజీగా వున్నారు. ఈ క్రమంలో రాధేశ్యామ్‌కు మరింత హైప్ తేవడం కోసం ప్రభాస్ అభిమానుల కోసం మార్చ్ 8న ఈ సినిమాకు సంబంధించిన ఎన్‌ఎఫ్‌టీ (NFT) లాంఛింగ్ జరగనుంది.
ఈ కలెక్షన్‌లో ప్రభాస్ డిజిటల్ ఆటోగ్రాఫ్, 3డి యానిమేటెడ్ డిజిటల్ ఆర్ట్‌తో పాటు ఎక్స్‌క్లూజివ్ 3డి యానిమేటెడ్ పిక్చర్స్ కూడా వుంటాయి. అంతేకాకుండా రాధేశ్యామ్‌లో ప్రభాస్ నడిపిన కారుకు సంబంధించిన 3డి యానిమేటెడ్ NFT కూడా ఇందులో వుంటాయి. వాటిని దక్కించుకోవాలని అనుకుంటున్న అభిమానులకు మార్చ్ 8 నుంచి ఇవి అందుబాటులోకి రానున్నాయి. డిజిటల్ కలెక్షన్‌లో విజేతగా నిలిచిన 100 మంది లక్కీ విన్నర్స్ నేరుగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌ను కలిసే బంపరాఫర్‌ను అందుకోనున్నారు. అంటే ఈ NFTలు ఎవరు ఎక్కువగా కొనుగోలు చేస్తే వాళ్లకు తమకు ఇష్టమైన స్టార్‌ను కలిసే అవకాశాలు పెరుగుతాయి.
ఇకపోతే.. పీరియాడిక్ లవ్ స్టోరీగా ‘రాధే శ్యామ్’ సినిమాను రూపొందించారు. కృష్ణంరాజు సమర్పణలో యువీ క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రమోద్, వంశీ, ప్రశీద ఈ సినిమాను నిర్మించగా.. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో ప్రభాస్ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించింది. ఇందులో విక్రమాదిత్య అనే హస్త సాముద్రికా నిపుణుడి పాత్ర పోషించారు ప్రభాస్.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments