రాధేశ్యామ్’ గ్లింప్స్: ఛ.. వాడు ప్రేమకోసం చచ్చాడు, నేనా టైప్ కాదు
Send us your feedback to audioarticles@vaarta.com
రెబల్‌స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా రూపొందుతోన్న ప్యాన్ ఇండియా మూవీ రాధేశ్యామ్. ప్రభాస్ సరసన పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తోంది. ప్రేమికుల రోజు(వేలంటైన్స్ డే ) సందర్భంగా ఈ సినిమా గ్లింప్స్‌ను ఆదివారం చిత్ర యూనిట్ విడుదల చేసింది. యూరప్‌లో ట్రెయిన్ ఆగడం అక్కడ ప్రభాస్ స్థానిక భాషలో తన ప్రేమను వ్యక్త పరుస్తూ డైలాగ్ చెప్పడం.. స్టేషన్లో ఉన్న అమ్మాయిలంతా ముసిముసి నవ్వులు నవ్వుతుండటంతో గ్లింప్స్ ప్రారంభమవుతుంది.
‘నువ్వేమైనా రోమియో అనుకుంటున్నావా..’ అని పూజా హెగ్డే అంటే ‘ఛ.. వాడు ప్రేమకోసం చచ్చాడు, నేను ఆ టైప్ కాదు..’ అంటూ ప్రభాస్ చెప్పే డైలాగ్ ఆకట్టుకుంటున్నాయి. తను ప్రేమను సాధించుకునే టైప్ అని ప్రభాస్ చెప్పకనే చెప్పాడు. మొత్తానికి ఈ లవ్ అండ్ రొమాంటిక్ ఎంటరైనర్ ప్రేక్షకులకు అమితంగా నచ్చుతుందనడంలో సందేహం లేదు. ప్రభాస్ తొలి సినిమా ‘ఈశ్వర్’ ఆ తరువాత ఒకటి అర తప్ప ప్రభాస్ కెరీర్లోనే కంప్లీట్ లవ్ స్టోరీస్ ఇప్పటి వరకూ చేయలేదు. కానీ ఈ సినిమా పూర్తి లవ్ అండ్ ఎంటర్టైనర్ కావడంతో యూత్‌లో మరింత ఆసక్తి పెరిగింది.
ఈ సినిమాపై అంచనాలకైతే కొదువ లేదు. ప్రభాస్ నేషనల్ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకోవడం.. ప్యాన్ ఇండియా మూవీగా ఈ సినిమా తెరకెక్కుతుండటంతో ఆయన ఇమేజ్ను ఈ చిత్రం మరింత పెంచే అవకాశం ఉంది. యూవీ కృష్ణంరాజు సమర్పణలో గోపీకృష్ణా మూవీస్, యూవీ క్రియేషన్స్ బ్యానర్స్‌పై వంశీ, ప్రమోద్, ప్రశీద ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తెలుగు, హిందీ సహా కన్నడ, మలయాళ, తమిళ భాషల్లో సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ పీరియాడిక్ లవ్‌స్టోరి షూటింగ్ కూడా తుది దశకు చేరుకుంది. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ డేట్‌ను చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించనుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments