కొత్త సంవత్సరం రోజున రాధేశ్యామ్ టీజర్.. రిలీజ్ డేట్ ఫిక్స్..!
Send us your feedback to audioarticles@vaarta.com
రెబల్‌స్టార్ ప్రభాస్ హీరోగా రూపొందుతోన్న చిత్రం ‘రాధేశ్యామ్’. ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా? అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. చిన్నా చితకా అప్డేట్స్ మినహా ఈ సినిమాకు సంబంధించి మేజర్ అప్డేట్ లేదని అభిమానులు బాధపడుతున్నారు. అయితే అభిమానుల కోరిక తీర్చడానికి ప్రభాస్ సిద్ధమయ్యారు. కొత్త సంవత్సరం రోజున రాధేశ్యామ్ నుండి టీజర్ వస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి.
కాగా.. దీంతో పాటు మరో వార్త కూడా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. అదేంటంటే.. రాధేశ్యామ్ విడులకు సంబంధించి. సినీ వర్గాల సమాచారం మేరకు రాధేశ్యామ్ విడుదల ముందు జూన్‌లో ఉండే అవకాశాలున్నాయని అన్నారు. కానీ తాజా సమాచారం మేరకు సినిమా విడుదల ఇంకాస్త ముందుకు వచ్చింది.మార్చి 30న రాధేశ్యామ్‌ను తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారట.
పీరియాడిక్ లవ్‌స్టోరీగా రూపొందుతోన్న ఈ చిత్రంలో ప్రభాస్ సరసన పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తుంది. ప్రస్తుతం షూటింగ్ హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో జరుగుతోంది. షూటింగ్ కూడా ఫైనల్ దశకు చేరుకుంది. సంక్రాంతి లోపు ‘రాధేశ్యామ్’
ఈ సినిమా తర్వాత ప్రభాస్ తదుపరి చిత్రంగా ‘సలార్’ షూటింగ్‌ను జనవరి 18 నుంచి స్టార్ట్ చేయడానికి రెడీ అయ్యాడని టాక్ వినిపిస్తోంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments