‘రాధేశ్యామ్’ షూటింగ్ అక్కడేనట!!
Send us your feedback to audioarticles@vaarta.com
‘బాహుబలి’ తర్వాత ప్యాన్ ఇండియా స్టార్‌గా మారిన ప్రభాస్.. ఇప్పుడు ఆ రేంజ్‌లోనే సినిమాలు చేస్తున్నారు. ఇప్పుడు ప్రభాస్ మూడు ప్యాన్ ఇండియా మూవీస్ చేస్తున్నారు. అందులో ముందుగా ‘రాధేశ్యామ్’ సెట్స్‌పై ఉంది. కరోనా వైరస్ వల్ల ఆగిన ఈ సినిమా షూటింగ్ వచ్చే నెల ద్వితీయార్థంలో ప్రారంభం కానుంది. ఇదంతా బావుంది కానీ.. ప్రభాస్ అభిమానులకు ఓ సందేహం తీరడం లేదు. ఎందుకంటే ‘రాధేశ్యామ్’ షూటింగ్ ఎక్కడ స్టార్ట్ అవుతుందని. యూరప్ షెడ్యూల్ ప్లాన్ చేసుకున్న ప్రభాస్ అండ్ టీం కరోనా ఎఫెక్ట్‌తో ఇండియా చేరుకుంది. హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో ‘రాధేశ్యామ్’ కోసం రెండు భారీ సెట్స్ కూడా వేశారు. అయితే ఈ మధ్య ప్రభాస్ అండ్ టీమ్ పారిన్ వెళుతున్నారంటూ వార్తలు వినిపించాయి. దీంతోనే అభిమానులకు గందరగోళం నెలకొంది. అసలు ‘రాధేశ్యామ్’ షూటింగ్ ఎక్కడ మొదలెడతాడని.. తాజా ఇండస్ట్రీ వర్గాల సమాచారం మేరకు ప్రభాస్ అండ్ టీమ్ ఇటలీకి వెళుతున్నారట.
‘రాధేశ్యామ్’ను వచ్చే ఏడాది సమ్మర్లోనే విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ పీరియాడిక్ లవ్‌స్టోరిలో పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తుంది. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రాన్ని గోపీకృష్ణామూవీస్, యువీ క్రియేషన్స్ బ్యానర్స్ నిర్మిస్తున్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments