'రాధేశ్యామ్' విడుదల మరింత ఆలస్యం.. ఫ్యాన్స్‌కు నిరాశ తప్పదా?
Send us your feedback to audioarticles@vaarta.com
రెబల్‌స్టార్ ప్రభాస్ తాజా చిత్రం 'రాధేశ్యామ్' విషయంలో అభిమానులు గుర్రుగా ఉన్నారు. ఎందుకనో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సినిమాకు సంబంధించి ఫ్యాన్స్ సంతోషించేలా అప్‌డేట్స్ మాత్రం లేవు. ఈ విషయంపై ప్రభాస్ ఫ్యాన్స్ దర్శకుడు రాధాకృష్ణకుమార్, నిర్మాణ సంస్థల గురించి ట్రోలింగ్ కూడా చేసినా ఎలాంటి ఫలితం లేకుండా పోయింది. 'రాధేశ్యామ్'ను ఈ ఏడాది సమ్మర్‌లో విడుదల చేస్తామని ఇప్పటికే నిర్మాతలు ప్రకటించిన సంగతి తెలిసిందే. అంటే సినిమా ఏప్రిల్‌లోనే, మే నెలలోనో విడుదలవుతుందని ఫ్యాన్స్ భావించారు. కానీ లేటెస్ట్ సమాచారం మేరకు, ఇప్పుడు సినిమా రిలీజ్ విషయంలో ఫ్యాన్స్‌కు నిరాశ తప్పదని వార్తలు వినిపిస్తున్నాయి. రాధేశ్యామ్‌ను జూలై 12న విడుదల చేయాలని దర్శక నిర్మాతలు భావిస్తున్నారని టాక్ వినిపిస్తోంది. సమ్మర్‌లో అయినా వస్తుందనుకున్న సినిమా కాస్త వెనక్కి వెళుతుందని పక్కా అయితే మాత్రం మరోసారి ప్రభాస్ అభిమానుల చేతిలో 'రాధేశ్యామ్' దర్శక, నిర్మాతలు ట్రోల్ కావాల్సిందే.
అయితే 'రాధేశ్యామ్' నిర్మాతలు ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక బలమైన కారణం.. సమ్మర్‌లో ఇతర స్టార్ హీరోల సినిమాలు రేసులో ఉండటం ఒకటైతే, ప్యాన్ ఇండియా మూవీ కాబట్టి ఎలాంటి ఇబ్బందులు లేకుండా భారీ రేంజ్‌లో విడుదల అవసరం అనుకుంటే జూలై 12న మంచిదని అభిప్రాయపడుతున్నారట. సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ పీరియాడికల్ లవ్‌స్టోరిని యువీ కృష్ణంరాజు సమర్పణలో గోపీకృష్ణా మూవీస్, యువీ క్రియేషన్స్ బ్యానర్‌పై వంశీ, ప్రమోద్, ప్రశీద నిర్మిస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com