‘రాధేశ్యామ్’ ప్రభాస్ లేటెస్ట్ లుక్.. విడుదల తేదీ ఫిక్స్?

  • IndiaGlitz, [Friday,January 01 2021]

‘సాహో’ తరువాత యంగ్ రెబల్‌స్టార్‌ ప్రభాస్‌ వరుస సినిమాలను లైన్‌లో పెట్టేశాడు. ఈ క్రమంలోనే ప్రభాస్ హీరోగా 'జిల్‌' ఫేమ్‌ రాధాకృష్ణ కుమార్‌ దర్శకత్వంలో లేటెస్ట్‌ మూవీ 'రాధేశ్యామ్' తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో ప్రభాస్ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. వీరిద్దరికీ సంబంధించిన ఫస్ట్‌లుక్‌లు ఇప్పటికే విడుదలై అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈ లవ్ అండ్ ఎంటర్‌టైనర్‌పై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ప్రస్తుతం ఈ సినిమా హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుపుకుంటోంది.

ఈ సినిమా విడుదల కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. దీంతో సినిమా విడుదల తేదీపై నిర్మాతలు చర్చలు నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. పిరియాడికల్ మూవీగా ఈ సినిమా తెరకెక్కుతోంది. లేటెస్ట్‌గా కొత్త సంవత్సరం సందర్భంగా చిత్ర యూనిట్‌ ఈ సినిమా నుంచి ప్రభాస్‌ మరో లుక్‌ను విడుదల చేసింది. ఓ మడుగు పక్కన స్టైలిష్‌ లుక్‌లో ప్రభాస్‌ కూర్చుని ఉన్నాడు. కృష్ణంరాజు సమర్పణలో యువీ క్రియేషన్స్‌ బ్యానర్‌పై ప్రమోద్‌, వంశీ, ప్రశీద ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోన్న సమాచారం మేరకు ఈ ప్యాన్‌ ఇండియా చిత్రాన్ని మార్చి 30న విడుదల చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు.

More News

బిగ్‌బాస్ 4... చిరు కుమ్మేశారు.. టీఆర్పీ దూసుకెళ్లింది

తెలుగు బుల్లితెరపై అతి పెద్ద రియాలిటీ షో బిగ్‌బాస్‌.. ఇటీవలే సీజన్‌ 4ను కంప్లీట్‌ చేసుకున్న విషయం తెలిసిందే. సీజన్-4లో ఇద్దరు, ముగ్గురు కంటెస్టెంట్లు తప్ప మిగిలినవన్నీ

రేపు దేశమంతటా డ్రైరన్

కరోనా వ్యాక్సినేషన్‌ సన్నద్ధతకు దేశమంతటా డ్రై రన్‌ నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఈ మేరకు గురువారం కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్‌ భూషణ్‌ వీడియో కాన్ఫరెన్సింగ్‌ ద్వారా ఉన్నత

ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ వాయిదా వేస్తున్నాం: ఈటల

కోవిడ్ మహమ్మారి కారణంగా తలెత్తిన ఇబ్బందులన్నీ ఇప్పుడిప్పుడే కాస్త తొలుగుతున్నాయని ఆనందించే లోపే.. కోవిడ్ కొత్త స్ట్రెయిన్ ప్రపంచాన్ని భయాందోళనకు గురి చేసింది.

'మెగా' తప్పిదానికి క్షమాపణ చెప్పిన ఒటిటి సంస్థ

కరోనా మహమ్మారి కారణంగా థియేటర్లన్నీ మూతపడ్డాయి. దీంతో ఓటీటీలు రాజ్యమేలుతున్నాయి. లాక్‌డౌన్ కాలంలో ప్రేక్షకులు కామన్‌గానే ఓటీటీలకు అలవాటు పడిపోయారు. దీంతో ‘ఆహా’

ప్రముఖ నటుడు నర్సింగ్ యాదవ్ మృతి

అనారోగ్యంతో సినీ నటుడు నర్సింగ్ యాదవ్ సోమజిగూడా యశోద ఆస్పత్రిలో మృతి చెందారు. గత కొంతకాలంగా కిడ్నీ సమస్యతో బాధ పడుతున్నారు.