డేట్ ఫిక్స్ చేసుకున్న 'రాధేశ్యామ్'
Send us your feedback to audioarticles@vaarta.com
రెబల్‌స్టార్ ప్రభాస్ `రాధేశ్యామ్` విడుదల గురించి ఆయన అభిమానులు ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారనే సంగతి అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో వేలంటైన్స్ డే సందర్భంగా `రాధేశ్యామ్` గ్లింప్స్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. అయితే సినిమా విడుదలపై క్లారిటీ ఇచ్చేసింది. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ప్యాన్ ఇండియా మూవీగా `రాధేశ్యామ్` జూలై 30న విడుదల కానుంది. బాహుబలి, సాహో తర్వాత ప్రభాస్ హీరోగా నటిస్తోన్న ప్యాన్ ఇండియా మూవీ కావడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఈ పీరియాడికల్ లవ్‌స్టోరిలో పూజా హెగ్డే హీరోయిన్గా నటించింది. యూరప్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే చిత్రమిది. `జిల్` ఫేమ్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. యూవీ కృష్ణంరాజు సమర్పణలో గోపీకృష్ణామూవీస్, యూవీ క్రియేషన్స్ బ్యానర్స్‌పై వంశీ, ప్రమోద, ప్రశీద నిర్మిస్తున్నారు. వారం రోజుల మినహా మిగతా చిత్రీకరణంతా పూర్తయ్యింది. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం ప్రభాస్..ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సలార్ చిత్రం షూటింగ్ తో బిజీగా ఉన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com