సెప్టెంబర్ 1న 'రథావరం' వస్తోంది!
Send us your feedback to audioarticles@vaarta.com
ధర్మశ్రీ ఎంటర్ ప్రైజెస్ పతాకంపై శ్రీ మురళి, రచితారామ్ జంటగా మంజునాథ్.ఎన్ నిర్మించిన కన్నడ చిత్రాన్ని తెలుగులో `రథావరం` పేరుతో తెలుగులోకి అనువదిస్తున్నారు. `ది అల్టిమేట్ వారియర్` అనేది క్యాప్షన్. చంద్రశేఖర్ బండియప్ప దర్శకుడు. రవిశంకర్ విలన్ పాత్రలో నటించగా, చరణ్ రాజ్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటించారు. ఈ చిత్రం కన్నడలో ఇటీవల విడుదలై భారీ వసూళ్లు రాబట్టింది. ఈ చిత్రం సెప్టెంబర్ 1న గ్రాండ్‌గా అత్యధిక సెంటర్స్ లో విడుదలవుతోంది.
ఈ సందర్భంగా చిత్ర నిర్మాత మంజునాథ్.ఎన్ మాట్లాడుతూ… “కన్నడలో భారీ వసూళ్లు రాబట్టిన చిత్రాన్ని తెలుగులో `రథావరం` పేరుతో విడుదల చేస్తున్నాం. `రథావరం` అంటే నమ్మిన బంటు అని అర్థం. తెలుగు నేటివిటీకి తగిన విధంగా కొన్ని సెకండాఫ్ లో కొన్ని మార్పులు చేర్పులు చేసి తెలుగులో విడుదల చేస్తున్నాం. ఇందులో మూడు సాంగ్స్ ఉన్నాయి. ఇటీవల మ్యాంగో ఆడియో ద్వారా పాటలు మార్కెట్ లోకి విడుదల చేశాం. ఆడియో సక్సెస్ అయింది. హిజ్రాల గురించి ఎవరికీ తెలియని ఒక రహస్యాన్నిమా చిత్రం ద్వారా చూపిస్తున్నాం. ప్రతి ఒక్కరూ ఆ రహస్యాన్ని తెలుసుకోని తీరాలి.
ఈ సినిమా చూస్తే థర్డ్ జెండర్ యొక్క గొప్పతనం ఏంటో అర్ధమవుతుంది. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో నడిచే యాక్షన్ లవ్ స్టోరి. ఒక పొలిటీషియన్ తన స్వార్థం కోసం హీరోతో ఎలాంటి పని చేయించడానికి సిధ్దపడతాడు. ఈ క్రమంలో హీరో ఏం తెలుసుకుంటాడు. హిజ్రాలకు ఆ పొలిటీషియన్ కు అసలు ఏంటి లింక్ అనేది స్టోరీ. ఫ్యామిలీ అంతా కలిసి హాయిగా చూసే చిత్రమిది. క్లాస్, మాస్ ప్రేక్షకులకు నచ్చే విధమైన సన్నివేశాలు న్నాయి. సెప్టెంబర్ 1న గ్రాండ్ గా అత్యధిక సెంటర్స్ లో విడుదల చేస్తున్నాం`` అన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com