పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో యాక్షన్ థ్రిల్లర్ 'రథావరం'
Thursday, June 8, 2017 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
ల్యాండ్ డెవలపర్ గా బెంగుళూరులో ఎంతో మంచి పేరు తెచ్చుకున్న మంజునాథ్ కు సినిమాలంటే చాలా ఇష్టం కానీ, ఎప్పుడూ సినిమా చూడటమే తప్ప...సినిమా తీయాలని అనుకోలేదు. కానీ తనని `రథావరం`కథ మెప్పించడంతో అనుకోకుండా నిర్మాతగా మారాల్సి వచ్చిందంటున్నారు మంజునాథ్. ధర్మశ్రీ ఎంటర్ ప్రైజెస్ పతాకంపై చంద్రశేఖర్ బండియప్పను దర్శకుడుగా పరిచయం చేస్తూ...కన్నడనాట `ఉగ్రం`చిత్రంతో ఫేమస్ అయిన శ్రీమురళి హీరోగా టాప్ హీరోలతో సినిమాలు చేసి సాండిల్ వుడ్ లో నే టాప్ హీరోయిన్ గా పేరొందుతోన్న రచితారామ్ హీరోయిన్ గా ఈ చిత్రం రూపొందింది.
ఈ చిత్రాన్ని మంజునాథ్ తెలుగులోకి అనువదిస్తున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకుంటోన్న ఈచిత్రం త్వరలో విడదులకు సిధ్దమవుతోంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత ధర్మశ్రీ మంజునాథ్ .ఎన్ మాట్లాడుతూ... `రథావరం` అంటే సంస్కృతంలో నమ్మిన బంటు అని అర్థం. ఇదొక యూత్ ఫుల్ యాక్షన్ థ్రిల్లర్. ఇటీవల కాలంలో ఇలాంటి కథాంశంతో సినిమాలు రాలేదు. యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ ను కూడా బాగా ఆకట్టుకునే చిత్రమిది. కన్నడలో తొలి వారంలోనే 9 కోట్లు కలెక్ట్ చేసి రికార్డ్స్ క్రియేట్ చేసింది. చిత్ర కథ విషయానికొస్తే...ఓ మినిస్టర్ దగ్గర పని చేసే రథావరం తనకోసం ఏం చేయడానికైనా వెనుకాడడు. సిఎమ్ కావాలన్న కోరికతో రథావరాన్ని ఆ మినిస్టర్ చేయకూడని ఓ పని చేయడానికి పురమాయిస్తాడు. ఈ క్రమంలో రథావరం తను చేయకూడని తప్పు చేస్తున్నానని తెలుసుకుంటాడు. ఆ తర్వాత ఏమైంది? ఆ మినిస్టర్ సిఎమ్ అవుతాడా? రథావరం చివరకు ఎలా రియలైజ్ అయ్యాడు? అనేది ఆసక్తికరమైన అంశం. ఇలా పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో కథ నడుస్తూనే హిజ్రాల యొక్క విశిష్టతను ఈ చిత్రంలో చూపించే ప్రయత్నం చేశాం. అసలు హిజ్రాలకు ఈ కథకు లింకేంటి అన్నదే ఈ చిత్రంలోని ప్రధాన అంశం.
ప్రతి సీన్ ఉత్కంఠభరితంగా ఉంటుంది. నమ్మకం, ప్రేమ, ఫ్రెండ్ షిప్, త్యాగం, తల్లి పాల యొక్క గొప్పతనం ఇవన్నీ ఈ చిత్రంలో ఉంటాయి. ఏ ఒక్క ప్రాంతానికో చెందిన కాన్సెప్ట్ కాదిది. యూనివర్శిల్ కాన్సెప్ట్ కావడంతో తెలుగు ప్రేక్షకులు కచ్చితంగా నచ్చుతారనే ఉద్దేశంతో ఈ చిత్రాన్ని తెలుగులోకి అనువదిస్తున్నా. `ఉగ్రం` చిత్రంతో కన్నడలో పాపులారిటీ తెచ్చుకున్న శ్రీ మురళి హీరో గా నటించారు. తన పాత్ర మాస్ లుక్ లో చాలా రఫ్ గా ఉంటుంది. రచితారామ్ హీరోయిన్ గా నటించింది. కాలేజ్ స్టూడెంట్ గా రచితారామ్ నటన, గ్లామర్ సినిమాకు ప్రత్యేక ఆకర్షణ. అలాగే మినిస్టర్ పాత్రలో రవిశంకర్ తన విలనిజాన్ని అద్భుతంగా ప్రదర్శించారు. ఓ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో చరణ్ రాజ్ గారు నటించారు. సినిమాటోగ్రఫీ, పాటలు, నేపథ్య సంగీతం సినిమాకు ప్రధాన ఆకర్షణలు.
కథ ప్రకారం బెంగుళూరు, హైదరాబాద్ ప్రాంతాల్లో షూటింగ్ చేశాము. అనుకున్న దానికన్నా బడ్జెట్ పెరిగినా కూడా క్వాలిటీ పరంగా చాలా బాగా వచ్చింది. తప్పు చేయడం తప్పు కాదు కానీ, చేయకూడని తప్పు చేస్తే మాత్రం శిక్ష అనుభవించక తప్పదు, దాని నుంచి ఎవరూ తప్పించుకోలేరు అన్న సందేశాన్ని అంతర్లీనంగా అందిస్తున్నాం. సెన్సార్ పూర్తి చేసి త్వరలో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం`` అన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments