'రాధ' టీజర్ రివ్యూ...
Send us your feedback to audioarticles@vaarta.com
రన్‌రాజారన్, మళ్ళీ మళ్ళీ ఇది రానిరోజు, ఎక్స్‌ప్రెస్ రాజా, శతమానం భవతి వంటి సూపర్‌హిట్ చిత్రాలతో హ్యాట్రిక్ సాధించిన హీరో శర్వానంద్ కథానాయకుడిగా, భలే భలే మగాడివోయ్, సోగ్గాడే చిన్ని నాయనా చిత్రాల హీరోయిన్ లావణ్య త్రిపాఠి, అక్ష కథానాయికలుగా, ఛత్రపతి, డార్లింగ్, అత్తారింటికి దారేది, నాన్నకు ప్రేమతో వంటి సూపర్‌హిట్ చిత్రాలను నిర్మించిన భారీ నిర్మాత బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ `రాధ` చిత్రాన్ని రూపొందిస్తున్నారు.
భోగవల్లి బాపినీడు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్ఎల్పి పతాకంపై 'డార్లింగ్' చిత్రానికి కరుణాకరన్ వద్ద అసోసియేట్‌గా వర్క్ చేసిన చంద్రమోహన్ చింతాడ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతుంది. ఈ సినిమాలో రేసుగుర్రం, కిక్2, సుప్రీమ్ చిత్రాల్లో నటించిన రవికిషన్ ఇందులో విలన్‌గా నటిస్తున్నాడు. ఈ సినిమా టీజర్ విడుదలైంది. ముప్పై సెకన్ల పాటు ఉన్న రాధ టీజర్ కేవలం హీరో క్యారక్టరైజేషన్ను ఎలివేట్ చేసిందంతే. ఓ సీన్లో హీరోయిన్ లావణ్యత్రిపాఠిని చూపించారు. దుష్ట శిక్షణ..శిష్ట రక్షణ చేయడానికి అప్పట్లో కృష్ణుడు పుట్టాడు..ఇప్పుడు పోలీసోడు పుట్టాడు.. అనే డైలాగ్‌తో పాటు నీకు శ్లోకం కావాలా..సారాంశం కావాలా అనే డైలాగ్ హీరో మేనరిజమ్‌ను తెలియజేస్తుంది. ఓ ఊరి కోసం ఓ పోలీసోడు ఏం చేశాడనేదే కథేమో అనే విధంగా టీజర్ కనపడుతుంది. మరి పూర్తి సినిమా తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే...
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com