తప్పు ఒప్పుకొన్న రాధారవి
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రముఖ నటి నయనతార పట్ల రాధారవి చేసిన అనుచిత వ్యాఖ్యలకు ఒక్కసారిగా కోలీవుడ్ తో పాటు బాలీవుడ్ కూడా ఉలిక్కిపడింది. మహిళల పట్ల వేదికల మీద అసభ్యకరంగా మాట్లాడటం తప్పు అని ఖండించింది. దీంతో పాటు రాజకీయ పార్టీలు కూడా రాధారవి మాట్లాడిన తీరును దుయ్యబట్టాయి.
నయనతార నటిస్తున్న 'ఐరా' సినిమాను నిర్మించిన కేజేఆర్ స్టూడియోస్ ఏకంగా రాధారవి ని ఇకపై తమ సంస్థలో నిర్మించే సినిమాల్లో నటుడిగా తీసుకోదలచుకోవడం లేదని స్పష్టం చేశాయి. మిగిలిన నిర్మాణ సంస్థలు కూడా అతన్ని ఎంకరేజ్ చేయకూడదని పిలుపునిచ్చారు. నడిగర్ సంఘం జనరల్ సెక్రటరీ విశాల్ కూడా తీవ్రంగా స్పందించారు.
రాధారవి తన పేరులో ఉన్న తొలి రెండు అక్షరాలను తొలగించి ఇకపై రవి అని పిలిపించుకోవాలని సూచించారు. ఇప్పటికే ఈ విషయంపై రాధారవి సోదరి రాధిక, శరత్‌కుమార్ తనయ వరలక్ష్మి, సింగర్ చిన్మయి, నయన్ ప్రియుడు విఘ్నేష్ శివన్ స్పందించిన విషయం తెలిసిందే. దీని గురించి నయనతార మాత్రం ఎప్పుడూ నోరు తెరవలేదు. అయినా రాధారవి ఈ విషయం మీద స్పందించారు. తాను ఒక అర్థంతో మాట్లాడితే, అందరూ మరో అర్థంతో దాన్ని తీసుకున్నారని, వారంతా అనుకున్నట్టు తను తప్పుగా మాట్లాడి ఉంటే క్షమించమని క్షమాపణలు చెప్పారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments